Share News

వినాయక మండపాల పరిశీలన

ABN , Publish Date - Sep 17 , 2026 | 11:55 PM

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలోని వినాయక మండపాలను కాశీబుగ్గ డీఎస్పీ భవాని గురువారం రాత్రి పరిశీలించారు. కమిటీల సభ్యులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.

వినాయక మండపాల పరిశీలన
కమిటీ సభ్యులతో మాట్లాడుతున్న డీఎస్పీ భవాని :

పలాసరూరల్‌, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలోని వినాయక మండపాలను కాశీబుగ్గ డీఎస్పీ భవాని గురువారం రాత్రి పరిశీలించారు. కమిటీల సభ్యులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. నిమజ్జన సమయంలో డీజే తక్కువ మోతాదులో ఉపయోగించి తక్కువ సంఖ్యలో ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. నిమజ్జన సమయాన్ని కచ్చితంగా పోలీసులకు తెలియజేస్తే బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆమెతో పాటు సీఐ రామకృష్ణ,ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2026 | 11:55 PM