Share News

వివాదాస్పద స్థలం పరిశీలన

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:51 PM

ఫరీదుపేట పంచాయతీలో హైవేకి అనుకొని ఉన్న సర్వే నంబర్‌ 528-34లోని 75 సెంట్ల వివాదాస్పద స్థలాన్ని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ శనివారం పరిశీలించారు.

వివాదాస్పద స్థలం పరిశీలన

ఎచ్చెర్ల రూరల్‌, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ఫరీదుపేట పంచాయతీలో హైవేకి అనుకొని ఉన్న సర్వే నంబర్‌ 528-34లోని 75 సెంట్ల వివాదాస్పద స్థలాన్ని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ శనివారం పరిశీలించారు. తమ్మినేని చెల్లన్నకు గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన డి.పట్టాను అక్రమంగా తహసీల్దార్‌ రద్దు చేశారని, దీనిని స్థానిక బీజేపీ నాయకుడు ఆక్రమణకు సిద్ధమయ్యా రని ముఖ్యమంత్రి కార్యాలయంలో సెంటర్‌ ఫర్‌ లిబర్టీ సంస్థ ప్రతినిధులు ఈనెల 9న ఫిర్యాదు చేశారు. అలాగే గత నెల 29న విశ్రాంత డీజీపీ (ఇంటలిజెన్స్‌), సీఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ ఏబీ వెంకటే శ్వరరావు కూడా ఈ స్థలాన్ని పరిశీలించారు. ఈ నేపఽథ్యంలో జేసీ సదరు స్థలాన్ని పరిశీలించి పట్టా చరిత్ర, రద్దు, ఆక్రమణ ఆరోపణలపై తహసీల్దార్‌ బి.గోపాలరావును వివరణ అడిగారు. తహసీల్దార్‌ శైలిపై విమర్శలు వస్తున్నందున పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Oct 10 , 2026 | 11:51 PM