Share News

ముంపు పొలాల పరిశీలన

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:57 PM

ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను జిల్లా వ్యవసాయశాఖాధికారుల బృందం మంగళవారం పరిశీలించింది.

 ముంపు పొలాల పరిశీలన
ముంపుబారిన పడిన పొలాలను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయశాఖాధికారులు

సోంపేట/ఇచ్ఛాపురం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను జిల్లా వ్యవసాయశాఖాధికారుల బృందం మంగళవారం పరిశీలించింది. జిల్లా వ్యవసాయాధికారి వైవీ మురళీకృష్ణ, ఆత్మ పీడీ కె.జగన్మోహనరావు, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త భాగ్యలక్ష్మి తదితరులు బారువ పేటలోని కంబ ప్రాంతం, ఇన్నేసుపేట, తులసిగాం తదితర గ్రామాల్లో పర్యటించి ముంపు బారిన పడిన పొలాలను పరిశీలించారు. పంట నష్టం వివరాలు గుర్తించి పెట్టుబడి రాయితీ అందించేందుకు రైతుల వివ రాల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరా రు. రైతులతో మాట్లాడుతూ తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. జిల్లా వ్యవసాయాధికారి మురళీ కృష్ణ మాట్లాడుతూ.. ముంపునకు గురై ప్రస్తుతం టిల్లరింగ్‌ దశలో ఉన్న వరి పంటలకు పంట పరిస్ధితిని బట్టి పొటాష్‌, యూరియా కలిపి బూస్టర్‌ డోస్‌ను సిఫారసు మేరకు అందించాలని సూచించారు. నీరు పూర్తి గా తొలగిన తరువాత తగిన సమయంలో ఎరు వులను వినియోగించడం ద్వారా పంట పునరు ద్ధరణకు సహాయపడుతుందన్నారు. పంట నష్టా లను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ మార్గద ర్శకాల మేరకు సాయమందిం చేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త ఉదయ్‌ బాబు, మండల ఏవోలు బి.నరసింహమూర్తి, అజయ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 11:57 PM