Share News

పంటలను పరిశీలించి.. అవగాహన కల్పించి

ABN , Publish Date - Oct 29 , 2026 | 11:55 PM

సుసరాం, దండులక్ష్మీపురం, సత్రవుపేట, ప్రియాగ్రహారం, బెలమర, పాలవలస ప్రాంతాల్లోని నీట మునిగిన తంపర పొలాలను రాగోలు వ్యవసాయ శాస్త్రవేత్లఉ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ నీట మునిగిన పంటపై ఉప్పు ద్రావణం చల్లాలని, నేలవాలిన చేలను మీదకు దుబ్బుగా కట్టాలని, నీరు తొలగించాలన్నారు. వనవిష్ణుపురంలో ఇంటిపై చెట్టుపడింది. కోడూరు ఉన్నత పాఠశాలో ఒక చెట్టుకూలింది. వాటిని అధికారులు వెంటనే తొలగింపజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి సీఈఓ వెంకటరామన్‌, వ్యవసాయశాఖ ఏడీ వెంకటమధు, వ్యవసాయాధికారి చిరంజీవి, తహసీల్దార్‌ పి.శ్రీనివాసరావు, ఎంపీడీవో బలగ ప్రకాష్‌, మాజీ సర్పంచ్‌ డోల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

పంటలను పరిశీలించి.. అవగాహన కల్పించి
పోలాకి: తంపర ముంపుపొలాలను పరిశీలిస్తున్న అధికారులు

పోలాకి, అక్టోబరు, 29(ఆంఽధ్రజ్యోతి): సుసరాం, దండులక్ష్మీపురం, సత్రవుపేట, ప్రియాగ్రహారం, బెలమర, పాలవలస ప్రాంతాల్లోని నీట మునిగిన తంపర పొలాలను రాగోలు వ్యవసాయ శాస్త్రవేత్లఉ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ నీట మునిగిన పంటపై ఉప్పు ద్రావణం చల్లాలని, నేలవాలిన చేలను మీదకు దుబ్బుగా కట్టాలని, నీరు తొలగించాలన్నారు. వనవిష్ణుపురంలో ఇంటిపై చెట్టుపడింది. కోడూరు ఉన్నత పాఠశాలో ఒక చెట్టుకూలింది. వాటిని అధికారులు వెంటనే తొలగింపజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి సీఈఓ వెంకటరామన్‌, వ్యవసాయశాఖ ఏడీ వెంకటమధు, వ్యవసాయాధికారి చిరంజీవి, తహసీల్దార్‌ పి.శ్రీనివాసరావు, ఎంపీడీవో బలగ ప్రకాష్‌, మాజీ సర్పంచ్‌ డోల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

ఫ హిరమండలం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): హిరమండలం మండలంలో తుఫాన్‌ ప్రభావంతో సుమారు 800 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్టు ప్రాథమికంగా అంచనా వేసినట్టు వ్యవసాయ అధికారి సంధ్య చెప్పారు. మండలంలోని గులుమూరు గ్రామ పరిధిలో ఈదురు గాలులకు నేలకొరిగిన వరి పంటను గురువారం ఆమె పరిశీలించారు. గులుమూరు గ్రామ పరిధిలో 400 ఎకరాలు, కల్లటలో 150, అంబావల్లి, రెల్లివలస, అక్కరాపల్లి గ్రామాల పరిధిలో 250 ఎకరాలలో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశామన్నారు. పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.

ఫ కోటబొమ్మాళి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఉల్లి పంట దెబ్బతినకుండా, దుంపలు కుళ్లిపోకుండా కాపాడుకోవడానికి రైతులు తక్షణమే యాజమాన్య పద్ధతులు పాటించాలని ఉద్యానవన అధికారి కె.సునీత తెలిపారు. గురువారం మండలంలో గల తర్లిపేట, జీయన్నపేట, బమ్మిడిపేట, రామయ్యపేట గ్రామాల్లో ఉల్లి, టమాటా, మిరప, వంగ, బంతి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడుతూ ఉల్లి ఆకులపై తెల్లటి మచ్చలు, లేదా పురుగులు కనిపిస్తే పిప్రోనిల్‌ లేదా డైమిధోయేట్‌ను పిచికారీ చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయశాఖ సిబ్బంది బి.ఆమని, పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ పలాసరూరల్‌, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): పలాస మండలంలో తుఫాన్‌ ధాటికి నేలకొరిగిన వరిచేనును ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గురువారం పరిశీలించారు. పలాస మండలం కైజోల, శాసనంతో పాటు పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ జగన్నాథ ఆయకట్టు ప్రాంతంలో వరిచేనును పరిశీలించారు. పొలాల్లో నీటిని తొందరగా బయటకు విడిచిపెట్టాలని, పురుగుమందులు, ఎరువులను వేయడం వాయిదా వేయాలని సూచించారు. వర్షాలు ఆగిన తరువాత రెండు గ్రాముల కార్బెండైజాన్ని లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. అనంతరం రైతులతో సమస్యలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రాజశేఖర్‌, హరికుమార్‌, జ్యోతిబసు, ఏఈవో పాపారావు, రైతులు పాల్గొన్నారు.

ఫ ఆమదాలవలస, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): పంట పొలాల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపించాలని, నేలకొరిగిన పంటను జాగ్రత్తగా నిలబెట్టుకోవాలని ఆమ దాలవలస వ్యవసాయాధికారి మెట్ట మోహన్‌రావు సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరి పంటలను కాపాడుకోవడానికి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గురువారం మండలంలోని దూసి, తొగరాం, నిమ్మతొర్లోడ, నెల్లిపర్తి, కలి వరం, శ్రీనివాసాచార్యులుపేట గ్రామాల్లో పర్యటించి వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అగ్గి, కుళ్లు తెగులు లక్షణాలు కనిపిస్తే వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు మేరకు మందులు పిచికారీ చేయాలని తెలిపారు.

ఫ గార, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): బూరవల్లి నుంచి కళిగపట్నం వరకు మధ్యలో ఉన్న నదీతీర గ్రామాల్లో వంశధార నది వరదల వల్ల ప్రమాదానికి గురయ్యే ప్రదేశాలను డ్రోన్‌ కెమెరా ద్వారా తహసీల్దార్‌ ఎం.చక్రవర్తి, ఎస్‌ఐ సీహెచ్‌ గంగరాజు పరిశీలించారు. ఈ పద్ధతి ద్వారా నదీతీర గ్రామాల వారిని అప్రమత్తం చేశారు.

Updated Date - Oct 29 , 2026 | 11:55 PM