Share News

ఏసీబీ కేసులో మందస వీఆర్వోపై విచారణకు ఆదేశం

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:48 PM

మందస మండలం దన్నువూరు క్లస్టర్‌ విలేజ్‌ రెవెన్యూ అధికారి కిల్లి ప్రసాద్‌పై నమోదైన ఏసీబీ కేసులో పూర్తిస్థాయి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ మృతి చెందిన అప్పటి మందస తహసీ ల్దార్‌ డి.కొండలరావు (రిటైర్డ్‌)పై క్రమశిక్షణా చర్యలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏసీబీ కేసులో మందస వీఆర్వోపై విచారణకు ఆదేశం

మృతిచెందిన రిటైర్డ్‌ తహసీల్దార్‌పై చర్యలు నిలిపివేత

శ్రీకాకుళం, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): మందస మండలం దన్నువూరు క్లస్టర్‌ విలేజ్‌ రెవెన్యూ అధికారి కిల్లి ప్రసాద్‌పై నమోదైన ఏసీబీ కేసులో పూర్తిస్థాయి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ మృతి చెందిన అప్పటి మందస తహసీ ల్దార్‌ డి.కొండలరావు (రిటైర్డ్‌)పై క్రమశిక్షణా చర్యలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ (విజిలెన్స్‌.వి)శాఖ మంగళవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు విడుదల చేసింది.

దన్నువూరు వీఆర్వోపై డీఆర్వో విచారణ

దన్నువూరు వీఆర్వో కిల్లి ప్రసాద్‌పై ఏసీబీ గతంలో కేసు నమోదు చేసింది. ఈ ఆరోపణలపై వీఆర్వో నుంచి తీసుకున్న లిఖితపూర్వక సంజా యిషీని పరిశీలించిన ప్రభుత్వం, అది ఏమాత్రం సంతృప్తికరంగా లేదని నిర్ధా రించింది. దీంతో కంట్రోల్‌ అండ్‌ అప్పీల్‌ నిబంధనల కింద ఆయనపై విచారణ చేసేందుకు శ్రీకాకుళం డీఆర్వోని నియమించింది. నిబంధనల ప్రకారం విచారణను పూర్తి చేసి, మూడు నెలల్లోగా నివేదికను ప్రభుత్వా నికి సమర్పించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఇదే కేసులో ఏసీబీ అధికారుల నివేదిక ఆధారంగా అప్పటి మందస తహసీ ల్దార్‌ డి.కొండలరావుపై శాఖాపరమైన విచారణ కోసం ప్రభుత్వం గతంలో ఉత్తర్వులిచ్చింది. ఆయన నుంచి సంజాయిషీని తీసుకునేందుకు ప్రయ త్నించగా 2022 డిసెంబరు 13న మరణించినట్లు కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ మేరకు ఆయనపై తదుపరి చర్యలను నిలిపి వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఒక కీలక షరతు విధించింది. మర ణించిన అధికారి గతంలో చేసిన చర్యల వల్ల ప్రభుత్వానికి ఏదైనా నష్టం వాటిల్లినట్లు భవిష్యత్‌లో గుర్తిస్తే నిబంధనల ప్రకారం ఆ నష్టాన్ని ఆయన చట్టపరమైన వారసుల నుంచి రికవరీ చేస్తామని తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తదుపరి చర్యల నిమిత్తం ఈ ఉత్తర్వుల కాపీలను మంగళగిరిలోని చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌కు, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం పంపించింది.

Updated Date - Jun 23 , 2026 | 11:48 PM