Share News

టీటీడీ మేనేజర్‌ అవినీతిపై విచారణ

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:09 AM

శ్రీకాకుళం టీటీడీ కల్యాణ మండపం మేనేజర్‌గా పీవీ కూర్మేశ్వరరావు పనిచేసిన కాలంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినందున అతనిపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా శాఖాపరమైన విచారణకు రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది.

టీటీడీ  మేనేజర్‌ అవినీతిపై విచారణ

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

2017లో లంచం తీసుకుంటూ ఏసీబీకి

చిక్కిన కూర్మేశ్వరరావు

శ్రీకాకుళం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం టీటీడీ కల్యాణ మండపం మేనేజర్‌గా పీవీ కూర్మేశ్వరరావు పనిచేసిన కాలంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినందున అతనిపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా శాఖాపరమైన విచారణకు రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. టీటీడీ ట్రాన్స్‌పోర్ట్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌ రాము పడగండ్లను విచారణాధికారిగా నియ మిస్తూ రెవెన్యూ (విజిలెన్స్‌) శాఖ కార్యదర్శి కె.కన్నబాబు బుధవారం ఉత్త ర్వులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. కూర్మేశ్వరరావు మేనేజర్‌గా ఉన్న సమయంలో రాజాం కల్యాణ మండపంలో లైటింగ్‌, సౌండ్‌ సిస్టమ్స్‌ సరఫరాకు సంబంధించి శాశ్వత కాంట్రాక్టు ఇస్తానని చెప్పి రాజాంకు చెందిన ఎ.గౌరునాయుడు నుంచి రూ. 50 వేలు లంచం తీసుకున్నారు. దీనిపై 2017 మే 26న ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేసి ఆయన అవినీతిని బట్టబయలు చేశారు. తన పరిధిలోని కల్యాణ మండపాల్లో జరిగే కార్యక్రమాలకు లైటింగ్‌, సౌండ్‌, పూల అలంకరణ ఏర్పాట్లు చేసే వారి నుంచి కూర్మేశ్వరరావు తరచూ మామూళ్లు వసూలు చేసేవారని 2019లో ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పిం చారు. ఏసీబీ నివేదిక ఆధారంగా ఈ కేసును విచారణ నిమిత్తం తొలుత ట్రిబ్యునల్‌ ఫర్‌ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్‌ (టీడీపీ)కు పంపారు. ఆ తర్వాత టీడీపీ రద్దు కావడంతో కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌కి బదిలీ చేశారు. అయితే కోఐ సభ్యులు రాజీనామా చేయడంతో విచారణలో జాప్యం నెల కొంది. మరోవైపు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో.. విచారణను వేగవంతం చేసేం దుకు తాజాగా టీటీడీ జనరల్‌ మేనేజర్‌కే బాధ్యతలు అప్పగిస్తూ ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి 60 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Updated Date - Sep 24 , 2026 | 12:09 AM