Share News

రిటైర్డ్‌ ఎక్సైజ్‌ ఎస్‌ఐ నానిబాబుపై విచారణ

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:48 PM

ఇచ్ఛాపురం మండలం పురుషోత్త పురం సమీకృత (ఇంటిగ్రేటెడ్‌) చెక్‌పోస్టులో గతంలో ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ ఎస్‌ఐగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఆర్‌.నానిబాబుపై క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది.

 రిటైర్డ్‌ ఎక్సైజ్‌ ఎస్‌ఐ నానిబాబుపై విచారణ

ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ (విజిలెన్స్‌) శాఖ

శ్రీకాకుళం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం మండలం పురుషోత్త పురం సమీకృత (ఇంటిగ్రేటెడ్‌) చెక్‌పోస్టులో గతంలో ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ ఎస్‌ఐగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఆర్‌.నానిబాబుపై క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆయనపై ఉన్న అభియో గాలపై పూర్తిస్థాయి విచారణకు రాష్ట్ర రెవెన్యూ (విజిలెన్స్‌-4) శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌ కుమార్‌ మీనా శుక్రవారం జీవోఆర్టీ 1400, 1401 నెంబర్ల ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.

ఏసీబీ నివేదిక ఆధారంగా...

నానిబాబుపై ఏసీబీ డీజీ 2018 నవంబరు 13న సమర్పించిన తుది నివేదిక ఆధారంగా విధి నిర్వహణలో ఏపీసీఎస్‌ రూల్స్‌ 1964 నిబంధ నలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆయనపై ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. దీనిపై 2023 సెప్టెంబరు 5న నానిబాబు లిఖితపూర్వక వివరణను ప్రభుత్వానికి అందించారు. అందులో తనపై వచ్చిన ఆరో పణలతో ఖండించడంతో పాటు, వాటి నుంచి తనను విముక్తి చేసి నిలిపి వేసిన పెన్షనరీ ప్రయోజనాలను మంజూరు చేయాలని కోరారు. అయితే ఆయన ఇచ్చిన వివరణ ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోవడంతో తాజా గా లోతైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి విచా రణాధికారిగా విజయనగరం జిల్లా ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ పి. రామ చంద్రరావును నియమిస్తూ జీవో 1400 జారీ చేసింది. ఈ విచారణను మూడు నెలల్లోగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశిం చింది. అలాగే, క్రమశిక్షణా అథారిటీ తరఫున విచారణలో వాదనలు విని పించి, ఆధారాలు సమర్పించేందుకు వీలుగా ప్రెజెంటింగ్‌ ఆఫీసర్‌గా శ్రీకా కుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తిని నియమిస్తూ జీవో 1401 జారీ చేసింది. ఏసీబీ డీజీ నుంచి 2025 ఏప్రిల్‌ 16న అందిన ప్రతిపాదనల మేరకు ఈ నియామకం జరిగినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Updated Date - Aug 07 , 2026 | 11:48 PM