పెట్రో ధరల పెంపుపై వినూత్న నిరసన
ABN , Publish Date - May 16 , 2026 | 12:03 AM
పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఎచ్చె ర్లలో శుక్రవారం సీపీఎం నేత లు వినూత్నంగా నిరసన తెలిపారు. లారీకి తాడును కట్టి ముందుకు లాగారు.
ఎచ్చెర్ల, మే 15(ఆంధ్ర జ్యోతి): పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఎచ్చె ర్లలో శుక్రవారం సీపీఎం నేత లు వినూత్నంగా నిరసన తెలిపారు. లారీకి తాడును కట్టి ముందుకు లాగారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యుడు పి.తేజేశ్వర రావు, మండల కన్వీనర్ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ.. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై పెట్రోధరల పెంపు మరింత భార మవుతుందన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల అనంతరం కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ధరల పెంపు నిర్ణయం సరికాదన్నారు. తక్షణం పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు డి. బంగార్రాజు, టి.రామారావు, జి.శ్రీనివాసరావు, ఎల్.రాము, ఎన్.రమణ తదితరులు పాల్గొన్నారు.