Share News

రైతులకు ఉపయోగపడేలా ఆవిష్కరణలు

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:53 PM

వ్యవ సాయ రంగంలో వస్తున్న అధునాతన సాంకేతిక పరి జ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని, రైతులకు ప్రత్యక్షంగా ఉపయోగపడేలా నూతన ఆవిష్కరణలు, పరిశోధనలపై దృష్టి సారించాల ని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యా లయ ఉపకులపతి (వీసీ) డా.పీవీ సత్యనారా యణ అన్నారు.

రైతులకు ఉపయోగపడేలా ఆవిష్కరణలు
మాట్లాడుతున్న వీసీ డా.పీవీ సత్యనారాయణ

నైర వ్యవసాయ కళాశాలకు పూర్తి సహకారం

ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ వీసీ సత్యనారాయణ

శ్రీకాకుళం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): వ్యవ సాయ రంగంలో వస్తున్న అధునాతన సాంకేతిక పరి జ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని, రైతులకు ప్రత్యక్షంగా ఉపయోగపడేలా నూతన ఆవిష్కరణలు, పరిశోధనలపై దృష్టి సారించాల ని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యా లయ ఉపకులపతి (వీసీ) డా.పీవీ సత్యనారా యణ అన్నారు. సోమవారం శ్రీకాకుళం రూరల్‌ మండలం నైర వ్యవసాయ కళాశాలను పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని, అవసరమైన మరిన్ని మెరుగైన మౌలిక సదు పాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనం తరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్‌ డీన్‌ డా. చిన్నంనాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులకు, అధ్యా పకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కళాశా లలోని వివిధ విభాగాలు, తరగతి గదులు, వస తులను పరిశీలించారు.

ఉత్పత్తుల స్టాళ్ల పరిశీలన

అగ్రికల్చరల్‌ బీఎస్సీ చివరి సంవత్సరం చదు వుతున్న విద్యార్థులు తమ ప్రాంగణ పరిశోధన, అనుభవ పూర్వక అభ్యసన విభాగంలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శన స్టాళ్లను వీసీ తిలకించారు. వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాల ప్రదర్శనలను పరిశీలించి విద్యార్థులను అభినం దించారు. వారిని ప్రోత్సహిం చేందుకు స్వయం గా విద్యార్థుల వద్ద నుంచి విత్తనాలను కొను గోలు చేశారు. కార్యక్రమంలో కళాశాల ఆచార్యు లు ఏవీ రమణ, ఎ.ఉపేంద్ర, గురుమూర్తి, ఎన్‌. సురేష్‌ కుమార్‌, పి.సీతారామ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.గోవిందరావు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 11:53 PM