Share News

రైల్వే జోన్‌తో మౌలిక సదుపాయాలు

ABN , Publish Date - May 31 , 2026 | 11:10 PM

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ సోమవారం నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుండడం చారిత్రాత్మక ఘట్టమని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపుఅచ్చెన్నాయుడు ఆదివారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు.

రైల్వే జోన్‌తో మౌలిక సదుపాయాలు

కోటబొమ్మాళి, మే 31(ఆంధ్రజ్యోతి): విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ సోమవారం నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుండడం చారిత్రాత్మక ఘట్టమని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపుఅచ్చెన్నాయుడు ఆదివారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటుతో పరిపాలనా వికేంద్రీకరణకు బల మైన పునాది పడడమే కాకుండా రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణ, కొత్త ప్రా జెక్టుల అమలు, సరకు రవాణా సామర్థ్యం పెంపు, పారిశ్రామిక పెట్టుబడుల ఆకర ్షణకు విస్తృత అవకాశాలు ఏర్పడనున్నాయని వివరించారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలోని డబుల్‌ ఇంజ న్‌ సర్కార్‌కృషి వల్లే మహత్తర లక్ష్యం సాకారమైందని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో రైల్వేజోన్‌ అంఽశాన్ని చేర్చేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కృషి చేశా యని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికను నెరవేర్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు కార్యరూపం దాల్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్టవ్‌లకు తెలుపు ప్రజల తరపున మంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నాన్ని దేశంలోని ప్రముఖ రవాణా, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఈ జోన్‌ కీలక పాత్ర పోషించనుందని ఆయన పేర్కొన్నారు. రైల్వేజోన్‌ సాధన వెనుక దివంగత మహా నేత కింజరాపు ఎర్రన్నాయుడు చేసిన పోరాటం చిరస్మరణీయమని తెలిపారు.

Updated Date - May 31 , 2026 | 11:11 PM