గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:57 PM
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో గ్రామాలు అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయని పేర్కొనడానికి మౌలిక సౌకర్యాలే నిదర్శనమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్) తెలిపారు.
జి.సిగడాం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో గ్రామాలు అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయని పేర్కొనడానికి మౌలిక సౌకర్యాలే నిదర్శనమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్) తెలిపారు. గురువారం జగన్నాఽథవలసలో నిర్వహించిన నమస్తే ఎచ్చెర్ల మన గ్రామానికి -మన ఎమ్మెల్యే కార్యక్రమంలో మాట్లాడా రు. అనంతరం గ్రామస్థుల నుంచి వినతలు స్వీకరిం చారు. తొలుత సీసీ రహదారులు, రైతు సేవా కేంద్రా న్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జి.రామకృష్ణారావు, ఎంఈవో ఆరసాడ రవి, ఏపీవో సీహెచ్ సత్యన్నారాయణ, మాజీ సర్పంచ్‌లు పంచిరెడ్డి బంగారినాయుడు, రాములు, నాయకులు కుమరాపు రవికుమార్, పైల విష్నుమూర్తి, మీసాల రవికుమార్, బూరాడ వెంకటరమణ, కుదిరెళ్ల బుజ్జి, వజ్జపర్తి రఘరాం, నక్క మురళీ, ఆరెళ్ల గొళ్లాజీ, పడాల అప్పన్న పాల్గొన్నారు.