పాత్రునివలసలో ఇండోర్ స్టేడియం
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:35 PM
పాత్రునివలసలో ఇండోర్ స్టేడి యం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఇక్కడి ఆయన కార్యాలయం నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రూ.14 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ
శ్రీకాకుళం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): పాత్రునివలసలో ఇండోర్ స్టేడి యం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఇక్కడి ఆయన కార్యాలయం నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 6న రామ్మోహన్ నాయుడు కేంద్ర క్రీడాశాఖల మంత్రి మాండవీయతో ప్రత్యేకంగా ఢిల్లీలో భేటీ అయి ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాభి వృద్ధితో పాటు శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఏర్పాటు చేయా ల్సిన క్రీడా వసతులపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే క్రీడా వికాస్ కేంద్రాలతో పాటు, ఖేలో ఇండియా పథకం కింద మంజూరు కావా ల్సిన పాత్రునివలస స్పోర్ట్స్ విలేజ్‌కు సంబం ధించి ప్రస్తావించి సహ కరించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఖేలో ఇండియా పథకం కింద రాష్ట్రానికి రూ.60.76 కోట్లు మంజూరు చేయగా ఆ నిధుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి రూ.14 కోట్లు కేటాయిస్తూ ఉత్త ర్వులు విడుదలయ్యాయి. జిల్లాకు నిధులు మంజూరుకు సహకరిం చిన ప్రధాని మోదీ, కేంద్ర క్రీడల మంత్రి మాండవీయకు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు తోడ్పాటుతో భవిష్యత్‌లో రాష్ట్రంలో క్రీడాభివృద్ధి విశేషం గా జరగనుందని, అన్ని రకాల మౌలిక వసతులను క్రీడాకారులకు చేరు వ చేస్తూ వారి ఉన్నతికి పూర్తి తోడ్పాటు అందిస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పాత్రునివలస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు నిధులు మంజూరుపై క్రీడాకారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.