Share News

ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దిన ఇందిరాగాంధీ

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:34 AM

దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది, పేద ప్రజల పెన్నిధిగా, ఉక్కు మహి ళగా పేరు గాంచిన వ్యక్తి ఇందిరాగాంధీ అని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు కొనియాడారు.

ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దిన ఇందిరాగాంధీ
అరసవల్లి: ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సనపల అన్నాజీరావు :

అరసవల్లి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది, పేద ప్రజల పెన్నిధిగా, ఉక్కు మహి ళగా పేరు గాంచిన వ్యక్తి ఇందిరాగాంధీ అని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు కొనియాడారు. గురువారం శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్‌భవన్‌లో మాజీ ప్రఽధాని ఇందిరాగాంధీ జయంతి పురస్కరించు కుని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు.కార్యక్రమంలో పట్టణకాంగ్రెస్‌ అధ్యక్షుడు రెల్ల సురే ష్‌, మంత్రి నర్సింహమూర్తి, చాంద్‌భాషా, గొంటి రామా రావు,చంద్రశేఖర్‌, లీలారాణి, బంగారయ్య పాల్గొన్నారు.

ఫశ్రీకాకుళం కల్చరల్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఇందిరాగాంధీ నాయకత్వం అసమాన్యమైనదని జిల్లా గ్రం థాలయ సంస్థ కార్యదర్శి వీవీజీఎస్‌ శంకరరావు తెలి పారు. గురువారం శ్రీకాకుళంలోని జిల్లా కేంద్ర గ్రంథా లయంలో 59వ గ్రంఽథాలయ వారోత్సవాల్లో భాగంగా మాజీ ప్రధాని ఇందిరాగాందీ జయంతిని పురస్కరించు కుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళిఅర్పించారు. అనంతరం విద్యార్థులకు రంగవల్లికల పోటీలను నిర్వ హించారు. కార్యక్రమాల్లో సంఘసేవకులు సోడవరం ఈశ్వరరావు, కేంద్ర గ్రంథాలయ అధికారులు భాస్కర రాజు, ఎం.నీలమ్మ, వ రలక్ష్మి పాల్గొన్నారు.

ఫగార, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక గ్రంథాలయంలో ఇందిరాగాంధీ జయంతి పురస్కరిం చుకుని ఆమె చిత్రపటానికి గ్రంథ పాలకులు ఎన్‌.రామ కృష్ణ, ఇతర పెద్దలు, గ్రంథాలయ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - Nov 20 , 2026 | 12:34 AM