ప్రపంచశాంతికి భారతీయ తాత్వికతే దిక్సూచి
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:10 AM
): భారతీయ సనాతన తాత్విక చింతనే నేటి ప్రపంచానికి అసలైన శాంతి మార్గదర్శకమని వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు, రాజ్య సభ మాజీ సభ్యుడు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
ఎచ్చెర్ల, సెప్టెం బరు 23(ఆంధ్రజ్యోతి): భారతీయ సనాతన తాత్విక చింతనే నేటి ప్రపంచానికి అసలైన శాంతి మార్గదర్శకమని వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు, రాజ్య సభ మాజీ సభ్యుడు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ‘శాంతి-భిన్న సంస్కృతులు, సంప్ర దాయాలు’ అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సును బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ.. సమాజంలో అసమానతలు రూపుమాపినప్పుడే విశ్వశాం తి ఏర్పడుతుందని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల న్నారు. గోవా ఇండియా ఇంటర్నేషనల్ వర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకే షన్, రీసెర్చ్ వీసీ ప్రొఫెసర్ ఆర్.వెంకటరావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ న్యాయ బద్ధంగా వ్యవహరించినప్పుడే శాంతి సుస్థిరమవుతుందన్నారు. బీఆర్ ఏయూ వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని మాట్లాడుతూ.. ప్రపంచంలోని సర్వమతాలు శాంతి, మానవతా దృక్పథాన్నే ప్రబోధిస్తున్నాయన్నారు. కేంద్ర విద్యా శాఖ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ సచ్చిదానంద మిశ్రా మాట్లాడుతూ నాణ్యమైన విద్య ద్వారానే విభిన్న సంస్కృతులపై అవగా హన పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అడ్డ య్య, సదస్సు కన్వీనర్లు ఎన్.సంతోష్ రంగనాఽథ్, టి.సంతోషి పావని తదితరులు హాజరయ్యారు.
నామమాత్రంగా అంతర్జాతీయ సెమినార్
ఎచ్చెర్ల రూరల్, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు బుధవారం ప్రారంభ మైంది. అయితే జిల్లాలో తుఫాన్ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సదస్సు వాయిదా వేయకుండా నిర్వహించారు. ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి 9 మంది హాజరు కానున్నారని వర్సిటీ అధికారులు ప్రకటించినా వర్చువల్‌లో ఇద్దరు మాత్రమే పాల్గొన్నారు. అయితే తుఫాన్ నేపథ్యంలో సదస్సును వాయిదా వేయకుండా నిర్వహించడంతో నామమాత్రంగా సాగింది. దీనిపై సదస్సు కన్వీనర్ సంతోష్ రంగనాథ్ వద్ద ప్రస్తావించగా తొలిరోజు ఇద్దరు డెలిగేట్లు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారన్నారు. షెడ్యూల్ మేరకు సదస్సు ప్రారంభించా మన్నారు. మిగిలిన రోజులు అనుకున్న షెడ్యూల్ మేరకు సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.