Share News

‘పెంచిన పెట్రో ధరలను ఉపసంహరించుకోవాలి’

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:26 PM

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తక్షణమే ఉపసంహరిం చుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నగరంలోని అంబేడ్కర్‌ కూడలి, పైడిభీమవరంలలో శుక్రవారం నిరసన తెలిపారు.

‘పెంచిన పెట్రో ధరలను ఉపసంహరించుకోవాలి’
రణస్థలం: పైడిభీమవరంలో నిరసన చేపడుతున్న సీఐటీయూ నేతలు

అరసవల్లి/రణస్థలం, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తక్షణమే ఉపసంహరిం చుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నగరంలోని అంబేడ్కర్‌ కూడలి, పైడిభీమవరంలలో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ..కేజీ బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న చమురు, గ్యాస్‌లో 50 శాతం మన రాష్ట్రానికే కేటాయించాలని కోరారు. యుద్ధ ప్రభావం మన దేశంపై ఉండదని, అయినా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రో ల్‌ రూ.118కి చేరుకుందని విమర్శించారు. కార్యక్ర మంలో నాయకులు ఆదినారాయణమూర్తి, మాతల గోవర్థనరావు, పల్లి జగ్గారావు, రైతుసంఘం అధ్యక్షుడు పి.చంద్రరావు, ఎం.అప్పల నరసయ్య, జె.రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 11:26 PM