Share News

నవధాన్యాల సాగుతో భూసారం పెరుగుదల

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:16 AM

ఎల్‌నినో ప్రభావంతో వేసవి పంటలను ఎదుర్కొనేలా నవధాన్యాల సాగు చేపట్టాలని జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్‌ కె.రాజగోపాల్‌ అన్నారు.

నవధాన్యాల సాగుతో భూసారం పెరుగుదల
జరజాంలో రైతులకు అవగాహన కలిగిస్తున్న జేడీ డాక్టర్‌ రాజగోపాల్‌

పశు సంవర్థకశాఖ జేడీ రాజగోపాల్‌

ఎచ్చెర్ల, జూలై 25(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో వేసవి పంటలను ఎదుర్కొనేలా నవధాన్యాల సాగు చేపట్టాలని జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్‌ కె.రాజగోపాల్‌ అన్నారు. జరజాం గ్రామంలో శనివారం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవధాన్యాల సాగులో 9 జాతులు, 30 రకాల విత్తనాలను ఎకరానికి 15 కిలోల చొప్పున వేయడం ద్వారా భూసారం పెరుగుతుందన్నారు. అలాగే పశువుల మేతకు ఉప యోగపడుతుందని, రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. ఈ విధానంలో 10 నుంచి 12 మెట్రిక్‌ టన్నుల పచ్చిరొట్ట వస్తుం దన్నారు. కూరగాయలు, ఆకుకూరలతో లాభదాయక సాగుతో అవ కాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీడీ డాక్టర్‌ ఎస్‌.సూర్య నారా యణ, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌లు వీవీ రమణ, జి.సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 12:16 AM