శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ.3.16 లక్షలు
ABN , Publish Date - Oct 28 , 2026 | 12:09 AM
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరాలయంలో గల హుండీ ఆదాయం రు.3,16,496 వచ్చినట్లు ఆలయ ఈవో ఏడుకొండలు తెలిపారు.
జలుమూరు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరాలయంలో గల హుండీ ఆదాయం రు.3,16,496 వచ్చినట్లు ఆలయ ఈవో ఏడుకొండలు తెలిపారు. దేవదాయశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఆలయ హుండీని మంగళవారం లెక్కించినట్లు ఆయన తెలిపారు. 84 రోజులకు గాను ఆలయ హుండీతో ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. మందస గ్రూపు ఆలయాల ఈవో ఎస్.నాగేశ్వరరావు పర్యవేక్షణలో కొమనాపల్లి సత్యసాయి భక్తులు, అర్చకులు, ఆలయ పాలకమండలి చైర్మన్ శివప్రసాద్ పాడి, సభ్యులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.