జీడి ఎగుమతులకు ప్రోత్సాహం
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:44 PM
జీడిపప్పు ఎగుమతులకు మరింత ప్రోత్స హించి స్థానిక పరిశ్రమల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పలాస జీడిపప్పుకు దేశీయ మార్కెట్‌తోపాటు ప్రపంచ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు.
కాశీబుగ్గ, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జీడిపప్పు ఎగుమతులకు మరింత ప్రోత్స హించి స్థానిక పరిశ్రమల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పలాస జీడిపప్పుకు దేశీయ మార్కెట్‌తోపాటు ప్రపంచ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. మంగళ వారం కాశీబుగ్గలో ఏపీఈడీఏ ఆధ్వర్యంలో జీడిపప్పుపై నిర్వహించిన వర్క్‌షాప్, ఎగుమతుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడుతూ వేలాది కుటుంబాలకు ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. జీడిపప్పు ఉత్పత్తి, ప్రాసెసింగ్‌తో పాటు నాణ్యాత ప్రమా ణాలు, ఆధునిక ప్యాకేజింగ్, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలు, ఎగుమతి విధా నాలపై వ్యాపారులు, పరిశ్రమ నిర్వాహ కులు అవగాహన పెంచుకోవాలని కోరా రు. స్థానిక జీడిపప్పు వ్యాపారులు, ప్రాసె సింగ్ యూనిట్ల యజమానులు, రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎం.శ్రీనివాస్‌రావు, ఏపీఈడీఏ అసిస్టెంట్ మేనజర్ విజయ్ బాలాజీ, సభ్యులు ఆర్పీ నాయుడు, వ్యాపారులు ఎం. కాంతారావు, మల్లా రామేశ్వరం, టంకాల రవి శంకర్ గుప్తా, మురళీకృష్ణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.