ఫైర్‌స్టేషన్ నూతన భవనం ప్రారంభం
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:29 PM
ఫైర్‌స్టేషన్ నూతన భవనాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ సోమవారం ప్రారంభించారు.
సోంపేట, అక్టోబరు5 (ఆంధ్రజ్యోతి): ఫైర్‌స్టేషన్ నూతన భవనాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ సోమవారం ప్రారంభించారు. 60 ఏళ్ల కిందటే జిల్లాలో రెండు అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు సర్దార్ గౌతు లచ్చన్న కృషి చేశారని, ఆయన విగ్ర హాన్ని స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపకాధికారి ఎ.మోహనరావు, ఎక్సైజ్ సీఐ జీవీ రమణ, సీఐ బి.మంగరాజు, జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు.