చదువులమ్మ చెట్టు నీడలో..
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:03 AM
శ్రీకాకుళం నగరంలోని చారిత్రక ప్రసిద్ధి కలిగిన మున్సిపల్ హైస్కూల్ (ప్రస్తుతం ఎన్టీఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల)లో ఓ యాభై ఏళ్ల కిందట చదువుకున్న విద్యార్థులంతా ఆదివారం ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు.
50 ఏళ్ల కిందట చదువుకుని ఒకచోట కలిసిన పూర్వ విద్యార్థులు
శ్రీకాకుళం కల్చరల్ జూలై 19(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలోని చారిత్రక ప్రసిద్ధి కలిగిన మున్సిపల్ హైస్కూల్ (ప్రస్తుతం ఎన్టీఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల)లో ఓ యాభై ఏళ్ల కిందట చదువుకున్న విద్యార్థులంతా ఆదివారం ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. 1976లో పదో తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థులు కలిసి నాటి జ్ఞాప కాలను నెమరువేసుకుని ఆనందం పొందారు. నాటి ఉపాధ్యాయులు, సహ చరుల్లో కొందరు మృతి చెందగా వారిని స్మరించుకుని నివాళి అర్పించారు. తాము పదో తరగతి చదువుకుని యాభై ఏళ్లు కావడం, మరోసారి ఇలా కలుసుకోవడం మరుపురాని అనుభూతి అని వారు పేర్కొన్నారు. కార్యక్ర మాన్ని ఎంవీ కామేశ్వరరావు, పీవీ శ్యాంసుందర్, ఫల్గుణరావు, పి. శారద, డి.గోపాలరావు తదితరులు సమన్వయం చేశారు.