Share News

పెళ్లిబాజాలు మోగాల్సిన ఇంట్లో..

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:26 AM

పదిరోజుల్లో పెళ్లి మూహూర్తం. నాలుగు అక్షింతలు వేసి ఓ ఇంటికి పంపిస్తాడనుకున్నారు. కానీ ఆకస్మాత్తుగా తండ్రి మృతిచెందడంతో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది.

పెళ్లిబాజాలు మోగాల్సిన ఇంట్లో..
తండ్రి చితి వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తున్న కుమార్తె ఝాన్సీ:

కవిటి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): పదిరోజుల్లో పెళ్లి మూహూర్తం. నాలుగు అక్షింతలు వేసి ఓ ఇంటికి పంపిస్తాడనుకున్నారు. కానీ ఆకస్మాత్తుగా తండ్రి మృతిచెందడంతో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. దీంతో ప్రగడపుట్టుగ గ్రామంలో పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇంటిలో బుధవారం విషాదచాయలు అలముకొన్నాయి. ప్రగడపుట్టుగ గ్రామానికి చెందిన బి.వెంకటరావు(55) కిడ్నీవ్యాధికి గురై ఆకస్మాత్తుగా మృతిచెందాడు. కవిటిలోని ప్రభుత్వాసుపత్రిలో స్వీపరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య దమయంతితోపాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్దకుమార్తెకు వివాహం జరిగింది. చిన్నకుమార్తె మౌలికకు పెండ్లి నిశ్చయమై ఈనెల 30న ముహూర్తాన్ని నిర్ణయించారు. ఇంతలో వెంకటరావు ఆరోగ్యం ఒక్క సారిగా క్షీణించడంతో సరైన వైద్యం అందించే పరిస్థితిలేక ఇబ్బందిపడ్డాడు. కుమార్తెకు నాలుగు అక్షింతలు వేసి అత్తవారింటికి పంపిస్తాడనుకున్న కల తీరకుండానే తండ్రి మృతిచెందడంతో రెండో కుమార్తె ఝాన్సీ అంత్యక్రియలు చేసి చితికి నిప్పంటించింది.

Updated Date - Aug 20 , 2026 | 12:26 AM