Share News

రహదారి సౌకర్యం మెరుగుపరచండి

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:21 AM

గ్రామ రహదారి దారుణంగా ఉంద ని తక్షణం నిర్మాణం చేపట్టి రోడ్డు సౌకర్యం మెరుగుపరచాలని డొంకపుట్టుగ గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

రహదారి సౌకర్యం మెరుగుపరచండి
డొంకపుట్టుగ రోడ్డుపై నిరసన తెలుపుతున్న గ్రామస్థులు

డొంకపుట్టుగ గ్రామస్థుల డిమాండ్‌

కవిటి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): గ్రామ రహదారి దారుణంగా ఉంద ని తక్షణం నిర్మాణం చేపట్టి రోడ్డు సౌకర్యం మెరుగుపరచాలని డొంకపుట్టుగ గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం నిరసన తెలిపారు. జగతి-శిలగాం రోడ్డు నుంచి డొంకపుట్టుగ గ్రామానికి రోడ్డు ఉందని, అయితే గోతులతోనిండిపోయిందని, కంకర రోడ్డు కావడంతో ఇబ్బందులు పడుతు న్నామన్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్డందా దారుణంగా తయారైం దని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డి.చలపతి, బి.ధనుం జయ, డి.చిరంజీవి, డి.దుర్వాసులు తదితరులు కోరారు.

Updated Date - Sep 25 , 2026 | 12:21 AM