Share News

ఎన్నికల హామీల అమలు.. జగన్‌ రెడ్డికి చెంపపెట్టు

ABN , Publish Date - Jan 05 , 2026 | 12:08 AM

‘ఎన్నికలకు ముందు ‘సిద్ధం’ సభలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ సీఎంగా అన్ని పథకాలు అమలు చేయలేక పోయాను.. మరి చంద్రబాబు రూ.40 వేల కోట్లు సబ్సిడీ ఎలా ఇస్తారు.. అని ప్రశ్నించారు.. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో అన్ని హామీలు అమలు చేసి చూపించాం.. ఇది జగన్‌ రెడ్డికి చెంపపెట్టు’ అని ఆమ దాలవలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు.

ఎన్నికల హామీల అమలు.. జగన్‌ రెడ్డికి చెంపపెట్టు
అరసవల్లి: మాట్లాడుతున్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌

అరసవల్లి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికలకు ముందు ‘సిద్ధం’ సభలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ సీఎంగా అన్ని పథకాలు అమలు చేయలేక పోయాను.. మరి చంద్రబాబు రూ.40 వేల కోట్లు సబ్సిడీ ఎలా ఇస్తారు.. అని ప్రశ్నించారు.. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో అన్ని హామీలు అమలు చేసి చూపించాం.. ఇది జగన్‌ రెడ్డికి చెంపపెట్టు’ అని ఆమ దాలవలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆది వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ నేడు పింఛన్ల పంపిణీలో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచామన్నారు. మేం విద్యుత్‌ చార్జీలు పెంచేదిలేదని చెప్పిన విధంగానే ఆచరణలో పెట్టామన్నారు. ట్రూ అప్‌ చార్జీలను రద్దు చేసి, యూనిట్‌పై 13 పైసలు తగ్గించామన్నారు. అదే వైసీపీ ప్రభు త్వ పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్తు చార్జీలను పెంచి, వినియోగదారుల నడ్డి విరిచిందని విమర్శించారు. సోలార్‌ వపర్‌ వినియోగించుకుని పరిశ్రమలకు విద్యుత్‌ అందిస్తున్నా మన్నారు. 2025-26 సంవత్సరంలో దేశంలోనే అత్యధిక పెట్టు బడులు సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ గుర్తించబడిం దన్నారు. వైసీపీ నాయకులారా చాలెంజ్‌... మీరు గాని.. మీ నాయకుడు గాని విద్యుత్‌పై మాట్లాడ్డానికి దమ్ముంటే రండి... మే సిద్ధంగా ఉన్నాం అని సవాల్‌ విసి రారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పీఎంజేబాబు, సింతు సుధాకర్‌, పాండ్రంకి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సంక్షేమానికి కట్టుబడి నిర్ణయం

కవిటి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విద్యు త్‌ చార్జీల పెంచకుండా నిర్ణయం తీసుకోవడం శుభపరి ణామమన్నారు. వైసీపీ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలతో ప్రజలపై భారం వేసిందని విమర్శించారు. కూటమి ప్రభు త్వం ఏర్పడిన తర్వాత ట్రూఅప్‌ చార్జీ లను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడమే కాకుండా యూని ట్‌కు 13 పైసలు తగ్గిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం వల్ల వినియోగదారులపై భారం తగ్గుతుందన్నారు.

Updated Date - Jan 05 , 2026 | 12:08 AM