సంక్షేమ పథకాలకు అత్యంత ఆదరణ
ABN , Publish Date - Aug 16 , 2026 | 11:50 PM
కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తరువాత అమలు చేసిన మహిళా సంక్షేమ పథకాలు అత్యంత ఆదరణ పొందాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
రణస్థలం, అగస్టు 16 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తరువాత అమలు చేసిన మహిళా సంక్షేమ పథకాలు అత్యంత ఆదరణ పొందాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు ఆదివారం జేఆర్‌పురంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను వివరించారు. స్ర్తీశక్తి పథకం, తల్లికి వందనం పథకాలు ప్రజల ఆదరణ పొందాయని, మహిళలకు ఈ పథకాలు బాగా ఉపయోగపడ్డాయని తెలిపారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ జి.రాము, కూటమి నాయకులు దెయ్యం శ్రీనివాస్, పైడి అప్పడుదొర, ఎం.కనకారావు, పిసి ని అసిరినాయుడు తదితరులు పాల్గొన్నారు.