శిలాఫలకంపై సీఎం, ఎమ్మెల్యే చిత్రాల ధ్వంసం
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:11 AM
హిరమండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ)లో కొందరు ఆకతాయిలు దుశ్చర్యకు పాల్ప డ్డారు.
ముఖాలు ఉన్న ప్రాంతాన్ని గీకేసిన ఆకతాయిలు
శ్రీకాకుళం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): హిరమండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ)లో కొందరు ఆకతాయిలు దుశ్చర్యకు పాల్ప డ్డారు. శిలాఫలకంపై ఉన్న ముఖ్య మంత్రి చంద్ర బాబు, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చిత్రాల్లో ముఖాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా పాఠశాల నిర్వాహకులు పట్టించుకోక పోవడం గమనార్హం. ఈ ఘటనపై ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినట్లు తెలిసింది.