అక్రమంగా తరలిస్తున్న పశువులు స్వాధీనం
ABN , Publish Date - May 11 , 2026 | 12:12 AM
నారాయణవలస సంత నుంచి అక్రమంగా విశాఖపట్నం వైపు తరలిస్తున్న పశువుల వాహనాన్ని ఎస్‌ఐ గణేష్ ఆదివారం జమ్ము పంచాయతీ శివరాంపురం వద్ద పట్టుకున్నారు.
నరసన్నపేట, మే 10(ఆంధ్రజ్యోతి): నారాయణవలస సంత నుంచి అక్రమంగా విశాఖపట్నం వైపు తరలిస్తున్న పశువుల వాహనాన్ని ఎస్‌ఐ గణేష్ ఆదివారం జమ్ము పంచాయతీ శివరాంపురం వద్ద పట్టుకున్నారు. తొమ్మిది ఆవులతో వెళ్లుతున్న వాహనం ఎవరికి అనుమానం రాకుండా గడ్డెయ్యపేట మీదుగా శివరాంపురం నుంచి జాతీయ రహదారిపై తరలించే సమయంలో అక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో వాహనంను పట్టుకున్నారు. పశువులను అక్రమంగా తరిలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి వాహన్ని సీజ్ చేసినట్లు ఎస్‌ఐ గణేష్ తెలిపారు. గోవులను గోశాలకు తరలించినట్టు ఎస్‌ఐ చెప్పారు.