Share News

‘అక్రమ కేసులు ఎత్తివేయాలి’

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:10 AM

ఈస్టుకోస్టు థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ కు వ్యతిరేకంగా పోరాడిన 400 మందిపై అక్రమంగా బనాయించిన కేసులు వెంటనే ఎత్తివేయాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌ డిమాండ్‌ చేశారు.

‘అక్రమ కేసులు ఎత్తివేయాలి’
స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న పోరాట కమిటీ నాయకులు

సంతబొమ్మాళి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ఈస్టుకోస్టు థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ కు వ్యతిరేకంగా పోరాడిన 400 మందిపై అక్రమంగా బనాయించిన కేసులు వెంటనే ఎత్తివేయాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌ డిమాండ్‌ చేశారు. శనివారం హనుమంతునాయుడుపేట (హెచ్‌ఎన్‌ పేట)లోని అమరవీరుల స్మృతివనం వద్ద 15ఏళ్ల కిందట జరిగిన పవర్‌ ప్లాం టు వ్యతిరేక ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో మృతి చెందిన సీరపు ఎర్రయ్య, జీరు నాగేశ్వరరావు, బత్తిన బారికవాడులకు నివాళులర్పించారు. తంపర భూ ముల పరిరక్షణ కోసం వడ్డితాండ్రలో స్వదేశీ మత్స్యకారులు గత 15 ఏళ్లకు పైడి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారని, ఇది దేశానికి ఆదర్శంగా నిలిం దన్నారు. ఈ ప్రాంత మత్స్యకారుల జీవన విధానానికి ఆటంకంగా మారిన జీవో నెం.1108 తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పోరాట కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్‌.వెంకటరావు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంకల మాధవరావు, పోరాట కమిటీ నాయకులు హనూరావు, నర్సింగరావు, సన్నశెట్టి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2026 | 12:11 AM