Share News

అక్రమ కేసులను ఎత్తివేయాలి

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:09 AM

రాష్ట్రంలో యువజన, విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమంగా బనాయించిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని యువజన, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

అక్రమ కేసులను ఎత్తివేయాలి
ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థి, యువజన ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు

అరసవల్లి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యువజన, విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమంగా బనాయించిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని యువజన, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా శుక్రవారం స్థానిక అంబేద్కర్‌ కూడలి వద్ద ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంతవరకు ఇచ్చిన హామీలను అమలు చేయలే దని ప్రశ్నించినందుకు విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై కేసులను బనా యించడం దారుణమన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీ గా ఉన్న 2.35 లక్షల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పూడి కిరణ్‌ కుమార్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్‌, సాయి కుమార్‌, డి.చందు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 12:09 AM