Share News

అక్రమాస్తులు రూ.1.1కోట్లు

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:18 AM

ACB raids ABCWO's house నరసన్నపేటలోని వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారి (ఏబీసీడబ్ల్యూవో) గడ్డి బాల ముకుందరావు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.1.10 కోట్ల విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు.

అక్రమాస్తులు రూ.1.1కోట్లు
ముకుందరావు ఇంట్లో లభ్యమైన బంగారం, వెండి ఆభరణాలు , కీలక పత్రాలు

  • ఏబీసీడబ్లూవో ఇంట్లో ఏసీబీ సోదాలు

  • పలు కీలకమైన పత్రాలు స్వాధీనం

  • శ్రీకాకుళం, మార్చి 2(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలోని వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారి (ఏబీసీడబ్ల్యూవో) గడ్డి బాల ముకుందరావు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.1.10 కోట్ల విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. నరసన్నపేట ఏబీసీడబ్ల్యూవోగా పనిచేస్తున్న బాలముకుందరావు.. ఇదే జిల్లాలోని సోంపేట విభాగానికి కూడా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వసతిగృహాలకు సంబంధించి మెస్‌ బిల్లులు మంజూరు చేసినందుకు ఆయన ఒక్కో విద్యార్థికి రూ.15 చొప్పున వసతి గృహ అధికారులు నుంచి మాముళ్ల వసూలు చేస్తున్నారన్న సమాచారం ఏసీబీకి అందింది. దీని ఆధారంగా ఈఏడాది జనవరి 28న ఆయనపై శ్రీకాకుళం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సోదాల్లో బాల ముకుందరావుతో పాటు ఆయన కార్యాలయ సహాయకుడు గుడ్ల రామకృష్ణ వద్ద లెక్క చూపని రూ.1,84,070 నగదను గుర్తించారు. ఆ నగదును లంచం డబ్బుగా నిర్ధారించి స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై అవినీతి నిరోధక (సవరణ-2018) చట్టం 1988 కింద క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

  • బయటపడిన భారీ ఆస్తులు...

  • ఈ కేసు దర్యాప్తులో భాగంగానే శ్రీకాకుళంలోని చాపురం 3- చిన్నబజారు, డీసీసీబీ కాలనీలో ఉన్న ముకుందరావు ఇంట్లో ఏసీబీ అధికారులు తాజాగా సోమవారం సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో నేరాన్ని నిరూపించే పలు సాక్ష్యాధారాలతోపాటు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి.

  • రాజాం, శ్రీకాకుళం, కొత్తవలస సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిఽధిలో 4 స్థిరాస్తులు (శ్రీకాకుళంలో ఒక భవనం సహా)

  • సుమారు 322 గ్రామాల బంగారు ఆభరణాలు, సుమారు 1.75 కిలోల వెండి, కొంత నగదు

  • ఒక మారుతీ సెలెరియా కారు, రెండు మోటార్‌ సైకిళ్లు, విలువైన గృహాపకరణాలను అక్రమాస్తులుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆస్తులు మొత్తం విలువ సుమారు రూ.1.10 కోట్లు ఉంటాయని, ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంతోందని స్పష్టం చేశారు. అధికారులెవరైనా అవినీతికి పాల్పడితే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని తెలిపారు. టోల్‌ఫ్రీ నెంబర్‌ 1064 లేదా 9440440057 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Updated Date - Mar 03 , 2026 | 12:18 AM