Share News

‘కొండ జోలికి వస్తే పోరాటం తప్పదు’

ABN , Publish Date - Aug 28 , 2026 | 11:59 PM

తమ గ్రామానికి చెందిన కొండ జోలికి వస్తే పోరాడేం దుకు వెనుకడుగువేసేది లేదని నమిడివలస, గదబపాలెం గ్రామాల రైతులు హెచ్చరించారు.

‘కొండ జోలికి వస్తే పోరాటం తప్పదు’
ధర్నా చేస్తున్న రైతులు

నడిమివలస కొండ వద్ద రైతుల ధర్నా

జి.సిగడాం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): తమ గ్రామానికి చెందిన కొండ జోలికి వస్తే పోరాడేం దుకు వెనుకడుగువేసేది లేదని నమిడివలస, గదబపాలెం గ్రామాల రైతులు హెచ్చరించారు. కొండ భూముల రక్షణ పోరాట కమిటీ అద్యక్షుడు ఇజ్జిరోతు రమేష్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కొండ వద్ద నిరసన తెలిపారు. ఆయన మాట్లా డుతూ.. కొండను కాపాడుకొనేం దుకు దశలవారీ పోరా టాలు చేస్తామన్నారు. పరిశ్రమల పేరుతో కొండలు, ప్రకృతి వనరులను కొల్లగొట్టడం సరికాదన్నారు. తక్షణమే రైతులు సాగు చేసుకుంటున్న భూము లకు పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అభిల భారత రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంకల మాధవరావు, పోరాట కమిటీ కార్యదర్శి వంకల గణపతి, గోవింద, మధు, జగదీష్‌, బాలి సత్యం, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2026 | 11:59 PM