Share News

ఇళ్లలో పేలుడు పదార్థాలుంటే జైలుకే..

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:17 AM

క్వారీలో వినియోగించే ప్రమాదకర పేళుడు పదా ర్థాలను ఇళ్లలో నిల్వచేస్తే బాధ్యులు జైలుకు వెళ్లక తప్పదని డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద హెచ్చరించారు.

ఇళ్లలో పేలుడు పదార్థాలుంటే జైలుకే..
మాట్లాడుతున్న డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద

పొందూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): క్వారీలో వినియోగించే ప్రమాదకర పేళుడు పదా ర్థాలను ఇళ్లలో నిల్వచేస్తే బాధ్యులు జైలుకు వెళ్లక తప్పదని డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద హెచ్చరించారు. కృష్ణా పురం ఆనందాశ్రమంలో మంగళవారం క్వారీ నిర్వాహకులు, కార్మికులు, పేలుడు పదార్థాల విక్రయ దారులతో సమావేశం నిర్వహించారు. పేలుడు పద ర్థాలను క్వారీ కార్మికుల ఇంటికే సరఫరా చేస్తు న్నారని, వారు ఇళ్లలో ఉంచుతున్నారని సమాచారం ఉందని, పట్టుబడితే కఠిన చర్యలు తప్ప వని హెచ్చరించారు. నిబంధనల మేరకు పేలుడు పదార్థాలను విక్రయించాలని అన్నారు. సమావేశం లో తహసీల్దార్‌ ఆర్‌.వెంకటేష్‌, సీఐ పి.సత్యనారాయణ, ఎస్‌ఐ వి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

బాణసంచా గోడౌన్ల తనిఖీ

మండలంలో ఉన్న శాశ్వత బాణసంచా గోడౌ న్లను మంగళవారం పోలీసులు తనిఖీ చేశారు. కాకినాడ జిల్లా వేట్లపాటెంలో జరిగిన పేలుడు నేపథ్యంలో బి.కంచరాం, పిల్లలవలస గ్రామాల్లో గోడౌన్‌లను పరిశీలించారు. ప్రమాదకర పేలు డు పదార్థాలున్నా, అనుమతులకు మించి నిలు వ చేసినా లైసెన్స్‌ రద్దు చేస్తామని ఆమదాల వలస సీఐ పి.సత్యనారాయణ హెచ్చరించారు. ఎస్‌ఐ వి.సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 12:17 AM