గొడవలు పడితే జైలే..
ABN , Publish Date - Nov 04 , 2026 | 12:44 AM
ఎన్నికల సమయంలో గొడవలు పడితే జైలుకు వెళ్లడం తప్పదని శ్రీకాకుళం డీఎస్పీ ధనుంజయ నాయుడు హెచ్చరించారు.
డీఎస్పీ ధనుంజయనాయుడు
పొందూరు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో గొడవలు పడితే జైలుకు వెళ్లడం తప్పదని శ్రీకాకుళం డీఎస్పీ ధనుంజయ నాయుడు హెచ్చరించారు. అ త్యంత సమస్యాత్మక గ్రామమైన గోకర్ణపల్లిలో మంగళవారం సాయంత్రం ఇరుపార్టీల నేత లు, కార్యకర్తలు, గ్రామ స్థులతో సమా వేశం నిర్వహించారు. కొట్లాటలకు పాల్పడిన వారి పైనా, అందుకు సంబంధించిన వారిపైనా రౌడీ షీట్ తెరుస్తామన్నారు. బెదిరిం పులతో ప్రలోభా లకు ప్రయత్నించినా కేసులు నమోదు చేస్తామ న్నారు. సీఐ సన్యాసి నాయుడు, ఎస్‌ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
‘నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు’
సరుబుజ్జిలి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు అనుచరులు ఏ ఒక్క రైనా ఎన్నికలు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆమదాలవలస సీఐ ఎం.సన్యాసి నా యుడు హెచ్చరించారు. మంగళవారం రొట్టవలస గ్రామంలో ఎస్‌ఐ ఎస్.చిరంజీవులు ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఇప్పటికే ఇరు పార్టీలకు చెందిన వ్యక్తులను బైండోర్ చేయ డం జరిగిందని, ఎటువంటి వివాదాలకు తలప డినా కఠిన చర్యలు తప్పవన్నారు. యువత, విద్యార్థులు రాజకీయాలకు, ఎన్నికల వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు.