Share News

లంచం అడిగితే 1064 నెంబర్‌కు కాల్‌ చేయండి

ABN , Publish Date - Oct 26 , 2026 | 11:55 PM

ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు ఉచితంగా పొందా లని, ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు.

లంచం అడిగితే 1064 నెంబర్‌కు కాల్‌ చేయండి
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఏసీబీ అధికారులు

ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు ఉచితంగా పొందా లని, ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రూపొందించిన 1064 ప్రచార పోస్టర్లను జిల్లా పోలీసు కార్యాలయంలో సోమ వారం ఆవిష్కరించారు. అలాగే లంచంపై ఫిర్యాదు కు 94404 40057 నెంబర్‌ను వినియోగించుకోవా లన్నారు. అవినీతికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొనిరావాల న్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉం చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ సత్య నారాయణ, సీఐలు ఎస్వీ రమణ, భాస్కరరావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నా రు. అలాగే లంచం అడి గితే నేరమని పేర్కొంటూ తయారుచేసిన ప్లెక్సీని ఏడు రోడ్ల కూడలిలో ప్రద ర్శించారు. అలాగే జీటీరోడ్డులో అవగాహన ర్యాలీ చేపట్టారు. సోమవారం నుంచి నవంబరు ఒకటో తేదీ వరకు విజిలెన్స్‌ అవ గాహన వారో త్సవాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ సత్య నారాయణ తెలిపారు. అవినీతిపై పోరులో ప్రజలు ఏసీబీ కార్యాలయ నెంబర్‌ 08942-278754, డీఎస్పీ 94404 46124, ఇన్‌స్పెక్టర్లు 73826 29272, 9491305632 నెంబర్లలో ఎక్కడైనా నిర్భయంగా సంప్ర దించవచ్చన్నారు.

విజిలెన్స్‌ వారోత్సవాల పోస్టర్‌ ఆవిష్కరణ

శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోస్టర్లను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. అవినీతి రహిత సమాజ నిర్మాణంపై అవగాహనా వారోత్సవాలు నవంబరు 1వ తేదీ వరకు జరగనున్నాయి. కార్యక్రమంలో ప్రాంతీ య నిఘా, అమలు విఽభాగం అధికారి సీహెచ్‌ వివేకానంద, డిప్యూటీ ఈఈ సత్యనారాయణ, అసి స్టెంట్‌ రిజిస్ర్టార్‌ ఎస్‌.ఎర్రంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2026 | 11:55 PM