చిన్నారుల్లో ఎదుగుదల లోపాలను గుర్తించాలి
ABN , Publish Date - Jun 02 , 2026 | 11:37 PM
చిన్నారుల్లో ఎదుగుదల, అభివృద్ధికి లోపాలను గుర్తించి, వారికి సరైన సమయంలో మంచి వైద్యం అం దించాలని డీఎంహెచ్‌వో డా.కె.అనిత అన్నారు.
డీఎంహెచ్‌వో డాక్టర్ కె.అనిత
అరసవల్లి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): చిన్నారుల్లో ఎదుగుదల, అభివృద్ధికి లోపాలను గుర్తించి, వారికి సరైన సమయంలో మంచి వైద్యం అం దించాలని డీఎంహెచ్‌వో డా.కె.అనిత అన్నారు. నవచేతన యాప్, చిన్నారుల అభివృద్ధి, లోపాల గుర్తింపుపై ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో మహిళా శిశు సంక్షేమశాఖ, జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరేళ్ల లోపు పిల్లల్లో ఆరోగ్యపరమైన లోపాలను స్ర్కీనింగ్ పరీక్షల ద్వారా గుర్తించి, వారికి సరైన వైద్యం అందించాలన్నారు. ముఖ్యం గా రెండేళ్ల లోపు పిల్లలకు బ్రెయిన్ డెవలప్‌మెంట్ అవు తుందని, ఆ సమయంలో వినికిడి లోపం, అటాచ్‌మెంట్ లోపాలను గుర్తించాలని, ఈ విషయాలపై తల్లి దండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఐసీ డీఎస్ అధికారి ఎస్.సువర్ణ మాట్లాడుతూ.. నవ చేతన కార్యక్రమం లక్ష్యాలను వివరించారు. సీడీపీవో రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.