Share News

సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తా: శిరీష

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:28 PM

ప్రజలు తమ సమ్యసల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వీలైనంత వరకు క్షేత్ర స్థాయిలోనే తెలుసుకొని... పరిష్కరించేందుకు కృషి చేస్తానని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఆదివారం కాశీబుగ్గ 4వవార్డు శాంతినగర్‌లో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో నేరుగా సమస్యలు తెలుసుకున్నారు.

 సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తా: శిరీష
పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే శిరీష

కాశీబుగ్గ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ప్రజలు తమ సమ్యసల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వీలైనంత వరకు క్షేత్ర స్థాయిలోనే తెలుసుకొని... పరిష్కరించేందుకు కృషి చేస్తానని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఆదివారం కాశీబుగ్గ 4వవార్డు శాంతినగర్‌లో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో నేరుగా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ శాంతినగర్‌లో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, వీదిలైట్లు తదితర సమస్యలను సంబంఽధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తానని అన్నారు. పథకాల అమలులో ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబురావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పీరుకట్ల విఠల్‌, రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు యాదవ్‌, 4వార్డు ఇన్‌చార్జి చెల్లూరు రామకృష్ణ, దువ్వాడ శ్రీకాంత్‌, సూర్యనారాయణ, చిన్ని, కొత్త సత్యం, కృష్ణమూర్తి, శంకర్‌, రవిశంకర్‌ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 11:28 PM