Share News

వైద్యఆరోగ్యశాఖను ప్రక్షాళన చేస్తా

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:00 AM

Curbing corruption through transparency జిల్లా వైద్యఆరోగ్యశాఖలో అవినీతికి పారదర్శకతతో చెక్‌పెడతానని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఈవీ నరేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈ నెల 24న బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేకంగా మాట్లాడారు. వైద్యఆరోగ్యశాఖలో అవినీతి, గ్రూపు రాజకీయాలు, అక్రమ డిప్యుటేషన్లు, సిబ్బంది వ్యవహారశైలి తదితరవాటిపై స్పందించారు. తనదైన శైలిలో వైద్యరోగ్యశాఖను ప్రక్షాళన చేస్తానని తెలిపారు.

వైద్యఆరోగ్యశాఖను ప్రక్షాళన చేస్తా
డీఎంహెచ్‌వో ఇవినరేష్‌కుమార్‌

  • పారదర్శకతతో అవినీతికి చెక్‌

  • పనిచేసేవారికి ప్రత్యేక గుర్తింపు

  • విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

  • డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఈవీ నరేష్‌కుమార్‌

  • శ్రీకాకుళం కల్చరల్‌, ఆగస్టు 28(ఆంద్రజ్యోతి): జిల్లా వైద్యఆరోగ్యశాఖలో అవినీతికి పారదర్శకతతో చెక్‌పెడతానని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఈవీ నరేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈ నెల 24న బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేకంగా మాట్లాడారు. వైద్యఆరోగ్యశాఖలో అవినీతి, గ్రూపు రాజకీయాలు, అక్రమ డిప్యుటేషన్లు, సిబ్బంది వ్యవహారశైలి తదితరవాటిపై స్పందించారు. తనదైన శైలిలో వైద్యరోగ్యశాఖను ప్రక్షాళన చేస్తానని తెలిపారు. ‘వైద్య ఆరోగ్యశాఖలో ఎక్కడ, ఏ కేడర్‌లో అవినీతి జరుగుతుందో గుర్తించి పారదర్శకతను తీసుకొస్తాం. పారదర్శకతకు పెద్దపీట వేస్తే అవినీతికి ఆస్కారం ఉండదు. ఓపెన్‌గానే పోస్టుల భర్తీ చేపడతాం. దరఖాస్తుల స్వీకరణ నుంచి తుది జాబితా వరకూ ప్రతిదీ పారదర్శకంగానే నిర్వహిస్తాం. జవాబుదారీతనం పెంచేలా ఈ-ఆఫీస్‌ను పకడ్బందీగా అమలు చేస్తాం. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరిస్తామ’ని డీఎంహెచ్‌వో తెలిపారు.

  • గ్రూపు రాజకీయాలు అరికట్టేలా..

  • ‘పనిలేని ఉద్యోగులే గ్రూపు రాజకీయాలు నడుపుతారు. వీటిని అరికట్టేలా చర్యలు చేపడతాం. ఎవరూ పనిలేకుండా ఖాళీగా కూర్చోబెట్టే ప్రసక్తే లేదు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌ సక్రమంగా అమలు కావాల్సిందే. ప్రతి ఉద్యోగి రోజూ మూడుసార్లు అటెండెన్స్‌ వేయాల్సిందే. ఏ ఉద్యోగి ఎన్నిగంటలకు హాజరు నమోదు చేస్తున్నారన్నది తప్పకుండా పరిశీలిస్తాను. విధులకు గైర్హాజరవుతున్నవారిపై చర్యలు తప్పవు. నేను ఎవరినీ భయపెట్టను. ఒకటికి రెండుసార్లు చెప్పి చూస్తాను. అప్పటికీ పనితీరు మారకపోతే చర్యలు తప్పవు. పనిచేసే వారికి ప్రత్యేక గుర్తింపునిస్తాం. గతంలో అక్రమ డిప్యుటేషన్లు జరిగినట్టు తెలిసింది. పీహెచ్‌సీల్లో 14 మంది ఉండాల్సిన చోట ఎక్కువ మంది ఉంటున్నట్టు సమాచారం. ఇటువంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి.. పరిస్థితిని సరిదిద్దుతాం. సాంకేతికపరంగా ముందుండేలా ప్రయత్నిస్తాం. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు సహకారంతో అంచనాలు అందుకోవడానికి కృషి చేస్తాన’ని డీఎంహెచ్‌వో నరేష్‌కుమార్‌ వెల్లడించారు.

  • సెలవు రోజుల్లోనూ సేవలు..

  • ‘సెలవు రోజుల్లో కూడా పనులకు ఆటంకం కలగకూడదన్నది నా పాలసీ. ఉన్నతాధికారులతో పాటు అందరితో ప్రతీరోజూ మాట్లాడతాను. నా వద్ద 24 గంటలు మించి ఏవీ పెండింగ్‌లో ఉంచను. నిర్ణయాలు వేగంగా తీసకుంటాను. ప్రతీరోజూ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతాను. కావాలని తప్పు చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా ముందే అప్రమత్తం అవుతాం. వివిధ పేరామీటర్ల విషయంలో జిల్లా ముందుండాలి. దీనిపై సమీక్షించి.. పూర్తిస్థాయిలో లక్ష్యాలు చేరుకునేలా వైద్యులు, సిబ్బందికి దిశానిర్దేశం చేస్తామ’ని డీఎంహెచ్‌వో నరేష్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Aug 29 , 2026 | 12:00 AM