ప్రేక్షకుల మన్ననలు పొందుతా.
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:06 AM
ఒళ్లు దగ్గర పెట్టుకుని మంచి సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందుతానని సినీ హీరో కిరణ్ అబ్బవరం అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం
‘చెన్నై లవర్ స్టోరీ’ చిత్ర బృందం సందడి
శ్రీకాకుళం అర్బన్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఒళ్లు దగ్గర పెట్టుకుని మంచి సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందుతానని సినీ హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. శుక్రవారం స్థానిక సరస్వతి థియేటర్‌లో మ్యాట్నీ సమయంలో ‘చెన్నై లవర్ స్టోరీ’ చిత్రబృందం సందడి చేసింది. నటీనటులు గౌరిప్రియ, కిరణ్ అబ్బవరం, డైరెక్టర్ రవి నంబూరి, నిర్మా తలు ఎస్‌కే ఎన్మరియు, సాయిరాజ్ పాల్గొని ప్రేక్షకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం సినిమా నచ్చిందా లేదా అని ప్రేక్ష కులకు అడిగి తెలుసుకున్నారు. మంచి సినిమాల్లో నటించి ప్రేక్ష కులను కలిసేందుకు మళ్లీ శ్రీకాకుళం వస్తానన్నారు. యువత భవిష్యత్ పై దృష్టిసారించాలన్నారు. అంతకు ముందు థియేటర్ మేనేజర్ శివరామరాజు (చిన్నరాజు), హీరో హీరో యిన్లను గజమాలతో సత్కరించి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు దుంగ భాస్కర్ పాల్గొన్నారు.