ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలబడతా: ఎన్‌ఈఆర్
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:57 PM
కార్మికుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడతానని, సీఐటీయూ రాజకీయాలకు కార్మికులు బలికావద్దని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. సోమవారం కూటమి నాయకులు శ్యాంక్రగ్ పిస్టన్స్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎన్‌ఈఆర్‌ను కలిసి విన్నవించారు.
రణస్థలం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): కార్మికుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడతానని, సీఐటీయూ రాజకీయాలకు కార్మికులు బలికావద్దని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. సోమవారం కూటమి నాయకులు శ్యాంక్రగ్ పిస్టన్స్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎన్‌ఈఆర్‌ను కలిసి విన్నవించారు. వీటిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం కోసం పని చేయడం తనకు కొత్తకాదని, కార్మికుల సమ స్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుటా నని స్పష్టం చేశారు. కార్మికుల హక్కుల కోసం గతంలో అనేక పోరాటాలు చేశానని గుర్తు చేశారు. కొంతమంది సీఐటీయూ నాయకులు తమ రాజ కీయ మనుగడ కోసం కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ, వారి జీవితాలతో రాజకీయం చేస్తున్నా రని విమర్శించారు. అటువంటి పరిస్థితిలో కార్మికులు ఇబ్బందులు పడడం బాధకు గురిచేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికుల సమస్యలను పట్టించుకోని మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు కార్మికులపై ప్రేమ చూపు తున్నట్లు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్మికులు వారి ఇబ్బందులపై నేరుగా తనతో సంప్ర దించవచ్చని, అవసరమైతే వారి సమక్షంలోనే పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సమావేశంలో కూటమి నాయకులు రౌతు శ్రీనివాస రావు, సురేష్‌రాజు, వడ్డాది శ్రీనివాసరావు, భానోజినాయుడు పాల్గొన్నారు.
‘సీఐటీయూపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు తగవు’
రణస్థలం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): సీఐటీయూపై ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు చేసిన అనుచిత వ్యాఖ్యలు తగవని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు అమ్మన్నాయుడు, జిల్లా కార్యదర్శి ఎన్‌వీ రమణ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక సంఘ కార్యాలయంలో యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్యాంపిస్టన్స్ ప్లాంట్-2లో కార్మికులను తొలగించిన నేపథ్యంలో బాధితుల కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహిస్తే.. పరిశ్రమను మూయించేందుకే ధర్నా నిర్వహించారని ఎమ్మె ల్యే ఎన్‌ఈఆర్ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అనేక పర్యాయాలు ఎమ్మెల్యేని కలిసి విన్న వించినా స్పందించని ఆయన యాజమాన్యానికి వత్తాసుపలికేలా మాట్లాడడాన్ని ప్రజలు గమనిస్తున్నా రన్నారు. సమావేశంలో శ్యాంక్రగ్ పిస్టన్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.అప్పల నరసయ్య, జి.కిరణ్, బి.తోటయ్య, ఎస్.రామారావు తదితరులు పాల్గొన్నారు.