చేపలు తెస్తానని వెళ్లి..
ABN , Publish Date - Apr 27 , 2026 | 12:08 AM
చేపలు తెస్తానని ఇంటి వద్ద చెప్పి వెళ్లిన ఓ యువకుడు తిరిగి వస్తుండగా వ్యాన్ ఢీకొ న్న ఘటనలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.
వ్యాన్ ఢీకొని యువకుడి మృతి
జలుమూరు (సారవకోట)/ పాతపట్నం, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): చేపలు తెస్తానని ఇంటి వద్ద చెప్పి వెళ్లిన ఓ యువకుడు తిరిగి వస్తుండగా వ్యాన్ ఢీకొ న్న ఘటనలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాతపట్నం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన బత్తిలి గణపతి(35) ఆటో డ్రైవర్‌గా పనిచే స్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం కావడంతో చేపలు తెచ్చేం దుకు సారవకోట మండలం బొంతు జంక్షన్‌కు తన ద్విచక్రవాహనంపై వెళ్లాడు. చేపలు కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా.. ఇదే మండలం పెద్దలంబ గ్రామ స మీపంలో ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొనడంతో గణపతి అక్కడికక్కడే మృతి చెందాడు. గణపతికి భార్య గాయత్రి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలిద్దరూ పాతపట్నంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో 9, 10వ తరగతి చదువు తున్నారు. వేసవి సెలవులు కావడంతో రెండు రోజుల కిందటే ఇంటికి వచ్చారు. గణపతి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పాతపట్నం సీహెచ్‌సీలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిం చారు. సారవకోట ఎస్‌ఐ అనిల్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ఆమదాలవలస, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): పట్టణం లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పట్టణ పరిధి నాలుగో వార్డు కసింవలసకు చెందిన సారిబిల్లి నాగేశ్వరరావు తన తమ్ముడు దుర్గారా వు(31)తో కలిసి ఆదివారం మధ్యాహ్నం గేదెలవానిపేట గ్రామంలో జరిగే ఒక కార్యక్రమానికి వెళ్లేందుకు బయ లుదేరాడు. ఈ క్రమంలో పట్టణంలోని ఓ బార్ వద్ద ఇద్దరూ మద్యం తాగారు. అనంతరం నాగేశ్వరరావు తమ్ముడిని అక్కడే ఉంచి గేదెలవానిపేటలో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి దుర్గారావు బార్ పైగదిలో అపస్మారక స్థితిలో పడి ఉండడం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొనేసరికి మృతి చెందినట్టు గుర్తించారు. నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ-2 ఎస్.కాంతారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
బస్సు ఢీకొని వృద్ధురాలు..
విశాఖలో ఘటన.. స్వగ్రామం మతలబుపేట
సరుబుజ్జిలి, ఏప్రిల్ 26(ఆం ధ్రజ్యోతి): మతలబుపేట గ్రా మానికి చెందిన పప్పల అమ్మ న్నమ్మ(74) ఆదివారం బస్సు ఢీకొని మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మే రకు.. విశాఖపట్నంలో ఉంటున్న చిన్న కుమార్తె ఇంటికి ఆమెతోనే కలిసి అమ్మన్నమ్మ ఆదివారం సాయంత్రం వెళ్లింది. విశాఖలోనే రోడ్డు దాటుతున్న సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిందని సరుబుజ్జిలిలో ఉన్న కుమారుడు శ్యా మలరావు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు మతలబుపేట, సరుబుజ్జి లి గ్రామాల్లో ఉన్న కుమారులు కుమా ర్తెలు, సోదరుల ఇళ్లల్లో సరదాగా గడిపిన అమ్మన్నమ్మ ఇంతలోనే మృత్యువాత పడడంతో వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.