మిస్టర్ ఇండియా టైటిల్ను సొంతం చేసుకోవాలి
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:31 AM
ww
శ్రీకాకుళం స్పోర్ట్స్, ఆక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్లో ఢిల్లేశ్వర రావు మరింతగా రాణించి మిస్టర్ ఇండియా టైటిల్ను సొంతం చేసుకోవా లని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆకాంక్షించారు. జైపూర్లో జరిగిన 58వ మిస్టర్ ఇండియా బాడీబిల్డింగ్ చాంపియన్షిప్ పోటీల్లో శ్రీకాకుళా నికి చెందిన రెడ్డి ఢిల్లేశ్వరరావు సత్తాచాటాడు. ఈమేరకు 75 కిలోల విభా గంలో ద్వితీయస్థానంలో నిలిచాడు. ఈసందర్భంగా గురువారం ఎమ్మెల్యే గొండు శంకర్ ఢిల్లేశ్వరరావును అభినందించారు.
తైక్వాండో సత్తాచాటిన విద్యార్థిని
కవిటి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని రాజపురం ఏపీ ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థిని కె.పావని రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ తైక్వాండో పోటీల్లో సత్తాచాటింది. ఈమేరకు స్వర్ణ పతకం లభించిందని ప్రిన్సిపాల్ నవీన్కుమార్ పాణిగ్రాహి తెలిపారు. రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన తైక్వాండో పోటీలో పావని మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. ఈసందర్భంగా పీఈటీ దుర్గాప్రసాద్, పావనికి సిబ్బంది అభినందించారు.