Share News

భర్తపై కత్తిపీటతో దాడి

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:19 AM

నౌగాం గ్రామంలో భర్తపై భార్య కత్తిపీటతో దాడికి పాల్ప డిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకొంది.

భర్తపై కత్తిపీటతో దాడి
చికిత్స పొందుతున్న సుందరరావు

నందిగాం మార్చి 12(ఆంధ్రజ్యోతి): నౌగాం గ్రామంలో భర్తపై భార్య కత్తిపీటతో దాడికి పాల్ప డిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నందిగాం మండలం నౌగాం గ్రామానికి చెందిన పల్లి సుం దరరావుకు కర్రెమ్మతో 25ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఇదే గ్రామంలోని ఓ వ్యక్తితో వివాహం జరిగింది. కుమారుడు ఉపాధికోసం దుబాయ్‌లో ఉన్నాడు. కాగా భార్యభర్తల మధ్య మనస్పర్థలుతో తరచూ గొడవలు జరుగుతుండడంతో ఐదేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. తల్లివద్ద ఉంటున్న సుం దరరావు మద్యం తాగి కర్రెమ్మ ఇంటి ముందు కొచ్చి గొడవ చేసేవాడు. ఎప్పటిలాగే గురువారం కూడా సుందరరావు పూటుగా మద్యం తాగి వచ్చి గొడవ చేయగా.. కర్రెమ్మ కత్తిపీటతో దాడి చేసంది. దీంతో సుందరరావు దాడి చేయడంతో కుడి చేయి, కుడి కాలు, ముడుకుపై గాయాలయ్యాయి.. గాయ పడిన సుందరరావును చికిత్స కోసం గ్రామస్థులు, కుటుంబసభ్యులు టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికు తరలించారు. కాగా ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Updated Date - Mar 13 , 2026 | 12:19 AM