Share News

మానవాళి నాగరికతకు చేనేతతోనే శ్రీకారం

ABN , Publish Date - Jan 22 , 2026 | 12:15 AM

మాన వాళి నాగరికతకు ప్రామాణికంగా చేనేతపరిశ్రమే నిలిచేదని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నా రు.

మానవాళి నాగరికతకు చేనేతతోనే శ్రీకారం

  • ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

పాతపట్నం, జనవరి 21(ఆంధ్రజ్యోతి): మాన వాళి నాగరికతకు ప్రామాణికంగా చేనేతపరిశ్రమే నిలిచేదని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నా రు. కాగువాడ గ్రామం వస్త్రపురి కాలనీలో బుధ వారం జరిగిన ఉత్తరాంధ్ర చేనేత చైతన్యసభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రక టించిన మేనిఫెస్టో శతశాతం అమలు చేస్తామ న్నారు. ఇచ్చిన హామీల మేరకు చేనేత కుటుంబా నికి 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌, ఏటా కుటుంబానికి రూ.25వేలు సాయాన్ని అమలు చేయాలని పలువరు కోరారు. చేనేత ఉత్పత్తులపై ఉన్న 5శాతం జీఎస్‌టీ తొలగించాలని కోరారు. పద్మశాలి కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ నందము అబద్ధయ్య మాట్లాడు తూ.. గత వైసీపీ పాలనా వైఫ ల్యాలతో చేనేత పరిశ్రమ అంప శయ్యపై చేరిందని స్పష్టం చేశా రు. కార్యక్రమంలో చేనేత కులా ల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌ పంప న రామకృష్ణ, ఆప్కో మాజీ డైరెక్టర్‌ కాశినప్రసాదరావు, డీసీసీ బీ మాజీ డైరెక్టర్‌ చింతా వీరభ ద్రేశ్వరరావు, సంతబొమ్మాళి పీఏసీఎస్‌ చైర్మన్‌ కూచెట్టి కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

Updated Date - Jan 22 , 2026 | 12:15 AM