కూటమి ప్రభుత్వ హయాంలో భారీగా నిధులు
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:07 AM
కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 21 నెలల కాలంలో పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్టు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.
పలాస, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 21 నెలల కాలంలో పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్టు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం మున్సిపాలిటీ పాలకవర్గం వీడ్కోలు సభ కమిషనర్ ఇ.శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిఽథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను అధికారం చేపట్టిన తరువాత 21 నెలలుగా మున్సిపాలిటీ అభివృద్ధిలో చైర్మన్‌గా బళ్ల గిరిబాబు ఎంతో సహకారం అందించారని కొనియాడారు. సభ ప్రారంభించిన తరువాత మొహం చూపించలేక వైసీపీ కౌన్సిలర్లు బయటకు వెళ్లిపోయారని తప్పుబట్టారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో రాష్ట్రంలో ప్రఽథమ స్థానం సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే తాగునీటి అవసరాలకు రూ.120 కోట్లు, కాలువల అభివృద్ధికి అదనంగా రూ.6 కోట్లు ఇచ్చామన్నారు. చైర్మన్ బళ్ల గిరిబాబు మాట్లాడుతూ నిజాయతీగా పనిచేసినా తనకు తమ నాయకులు సహకారం అందించలేదని అన్నారు. అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్‌రావు, వైస్‌చైర్మన్ మీసాల సురేష్‌బాబు, కౌన్సిలర్లు గురిటి సూర్యనారాయణ, దువ్వాడ శ్రీకాంత్ ప్రసంగించారు. అంతకు ముందు మున్సిపల్ పాలకవర్గాన్ని ఘనంగా సత్కరించి.. జ్ఞాపికలు అందించారు. అందుబాటులో వైద్యసేవలు
వజ్రపుకొత్తూరు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్యసేవలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మంగళవారం వజ్రపుకొత్తూరు పీహెచ్‌సీ ఆవరణలో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ూతన భవనాన్ని ఆమె ప్రారంబించారు. ఈ సందర్భంగా గౌతు శిరీష మాట్లాడుతూ రక్తపరీక్షల నిర్వహణకు రూ.50 లక్షలు వెచ్చించి యూనిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఆసుపత్రిలో బాలికలకు హెచ్‌పీవీ వాక్సిన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్ రిచర్డ్ బూన్, తేజస్విత, ఎంపీడీవో ఎన్.రమేష్‌నాయుడు, మండల టీడీపీ అధ్యక్షులు సూరాడ మోహనరావు, మాజీ అధ్యక్షులు బి.శశిభూషణ్, నాయకులు నెయ్యిల సూర్యనారాయణ పాల్గొన్నారు.
అన్నదాతలకు అండగా ...
హరిపురం, మార్చి17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతన్నా.. మీకోసం కార్యక్రమంతో అన్నదాతలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పొత్తంగిలో మంగళవారం ఏవో నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రైతన్నా మీ కోసం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అందజేసి.. అన్నదాతల సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జేడీ త్రినాథస్వామి, ఏడీ రామారావు, రాగోలు రీసెర్చ్ సెంటర్ అధికారి అజయ్‌బాబు, టీడీపీ నాయకులు బావన దుర్యోధన, సూరి, రుద్రయ్య పాల్గొన్నారు.