Share News

టీడీపీలోకి భారీ చేరికలు

ABN , Publish Date - May 18 , 2026 | 12:08 AM

నియోజక వర్గంలోని మెళియాపుట్టి మండలంలో వైసీపీకి గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత లతో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమక్షంలో ఆదివారం టీడీ పీలో చేరారు.

టీడీపీలోకి భారీ చేరికలు
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

  • ఎమ్మెల్యే గోవిందరావు సమక్షంలో చేరిన 290 వైసీపీ కుటుంబాలు

  • మెళియాపుట్టి మండలం నుంచి వలసలు

పాతపట్నం, మే 17(ఆంధ్రజ్యోతి): నియోజక వర్గంలోని మెళియాపుట్టి మండలంలో వైసీపీకి గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత లతో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమక్షంలో ఆదివారం టీడీ పీలో చేరారు. తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మె ల్యే, ప్రివిలేజ్‌ కమిటీ సభ్యులు మామిడి గోవింద రావు వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వా నించారు. మెళియాపుట్టి మండలం పెద్దకేదారి, పీఎన్‌ లోవ గ్రామాలకు చెందిన 290 కుటుంబా లు టీడీపీలో చేరాయి. పెద్దకేదారి గ్రామానికి చెందిన బైరిసింగి దినకర్‌ ఆధ్వర్యంలో సవర కామేష్‌, లంకపాడు లోకేష్‌, చిన్నింటి సింహాచలం తదితర 120 కుటుంబాలు, పీఎన్‌ లోవ గ్రామానికి చెందిన సవర వెంకటరావు, జన్ని మోహనరావు, జన్ని వెంకటరావు తదితర 170 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధితోపాటు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నాయకత్వంపై నమ్మకంతో టీడీపీలో చేరినట్టు తెలిపారు. కార్యక్రమంలో మెళియాపుట్టి మండల టీడీపీ అధ్యక్ష, ఉపాధ్య క్షులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2026 | 12:08 AM