Share News

ఇంత నిర్లక్ష్యమైతే ఎలా..?

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:04 AM

పాతపట్నంలోని అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో లోపాలను సరిదిద్దుతామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్క ర్‌ తెలిపారు. స్థానిక గురుకులంలో ఏడో తరగతి విద్యార్థిని చింతల పూజిత మృతి నేపథ్యంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ శనివారం సందర్శించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని, మెట్ల, టెర్రస్‌ను పరిశీలించారు. విద్యార్థిని ఎలా మృతిచెందిందో ఆరాతీశారు. విద్యార్థినులపై నిఘాలేకపోవడం, నిర్వహణ వైఫల్యాలు, లోపాలు గుర్తించి ప్రిన్సిపాల్‌ పద్మావతిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇంత నిర్లక్ష్యమైతే ఎలా..?
ఘటన గురించి కలెక్టర్‌కు వివరిస్తున్న అధికారులు

పాతపట్నం/రూరల్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): పాతపట్నంలోని అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో లోపాలను సరిదిద్దుతామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్క ర్‌ తెలిపారు. స్థానిక గురుకులంలో ఏడో తరగతి విద్యార్థిని చింతల పూజిత మృతి నేపథ్యంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ శనివారం సందర్శించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని, మెట్ల, టెర్రస్‌ను పరిశీలించారు. విద్యార్థిని ఎలా మృతిచెందిందో ఆరాతీశారు. విద్యార్థినులపై నిఘాలేకపోవడం, నిర్వహణ వైఫల్యాలు, లోపాలు గుర్తించి ప్రిన్సిపాల్‌ పద్మావతిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. షోకాజ్‌ నోటీస్‌లు ఇవ్వా లని అధికారులను ఆదేశించారు. ఇంత నిర్లక్ష్యంగా ఉండే ఎలా అని ప్రశ్నించారు. ఎస్‌ఐ కె.మధుసూదనరావును ప్రమాదం గురించి అడిగితెలుసుకున్నారు. ప్రమాదాలు జరగకుండా మెట్ల వద్ద మెస్‌ లేదా ప్రత్యామ్నాయ రక్షణ ఏర్పాట్లు తక్షణమే చేపట్టాల ని ఆదేశించారు. మరుగుదొడ్లకు తలుపులు, ప్రహరీ పనులకు నిధులు మంజూరు చేసినా పనులు ప్రారంభించకపోవడంపై ప్రిన్సిపాల్‌తో పాటు ఈడబ్ల్యూఐడీసీ జేఈ రామారావుపై అసహనం వ్యక్తంచేశారు. అనంతరం ఐదు,ఎనిమిదో తరగతుల్లో విద్యా ర్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. మెనూ అమలుపై విద్యార్థులను అడిగితెలుసుకు న్నారు. సోమవారం నుంచి జరగనున్న వార్షికపరీక్షలకు విద్యార్థులంతా సన్నద్ధమవ్వా లన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురుకులంలో చేపడుతున్న పలురకాల పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన సంబంధిత అధికారులకు షోకాజ్‌ నోటీ సులు సైతం జారీచేయనున్నట్లు తెలిపారు. అనంతరం మోడల్‌స్కూల్‌లో మూలకు చేరిన ఆర్వోప్లాంట్‌ పరిశీలించారు. తక్షణమే సురక్షితమైన తాగనీటిని విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ ఎన్‌.ప్రసాదరావుకు ఆదేశించారు. తర్వాత పాతపట్నం సచివాలయం-1లో సిబ్బంది రిజిస్ట్రర్లను పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో సమస్యలను గుర్తించేందుకు సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు కలెక్టర్‌ వారానికి మూడు సచివాలయాలను, మిగిలిన ప్రత్యేక అధికారులు ఎనిమిది సచివాలయాలను తనిఖీ నిర్వహించనున్నట్లు విలేకరులకు తెలిపారు.

గ్యాస్‌ కొరత సృష్టిస్తే చర్యలు

జలుమూరు, (సారవకోట) ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): గ్యాస్‌ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ హెచ్చరించారు. సారవకోటలో గల జైభీమ్‌ ఇండియన్‌ గ్యాస్‌ ఏజెన్సీని శనివారం పరిశీలించారు. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లు కొరతను అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట తహసీల్దార్‌ విజయలక్ష్మి, సీఎస్‌ డీటీ జాఫర్‌ షరీఫ్‌, ఎంపీడీవో మోహనకుమార్‌ ఉన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 12:04 AM