ఇంటి పన్ను సకాలంలో చెల్లించాలి
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:20 PM
ఇంటి పన్ను సకాలంలో చెల్లించి పం చాయతీ అభివృద్ధికి సహకరించాలని జడ్పీ సీఈవో డి.సత్యనారాయణ తెలిపారు.
జడ్పీ సీఈవో సత్యనారాయణ
కోటబొమ్మాళి, మార్చి 4(ఆంద్రజ్యోతి): ఇంటి పన్ను సకాలంలో చెల్లించి పం చాయతీ అభివృద్ధికి సహకరించాలని జడ్పీ సీఈవో డి.సత్యనారాయణ తెలిపా రు. బుధవారం స్థానిక ఎంపీడీవో కుప్పిలి ఫణీంద్రకుమార్‌తో కలిసి కోటబొ మ్మాళి మేజరు పంచాయతీలో పలు ఇళ్లు, దుకాణాలకు వెళ్లి యజమానులతో మాట్లాడారు. పంచాయతీ సిబ్బందికి సహకరించి ఇంటి పన్ను సకాలంలో చె ల్లించాలని వారికి సూచించారు. అలాగే మండలంలోని ఇంటి పన్నులు ఎంత మేర వసూలు చేశారని, ముఖ్యంగా కోటబొమ్మాళి మేజరు పంచాయతీలో ఎం త శాతం జరిగిందని ఎంపీడీవోను అడిగి తెలుసుకున్నారు. గడువులోగా ఇంటి పన్ను వసూళ్లు తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మేజరు పంచాయతీ కార్యదర్శి చింతాడ సన్యాసిరావు, సిబ్బంది పాల్గొన్నారు.