Share News

హోటళ్లలో నాణ్యమైన ఆహారం అందించాలి

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:10 AM

ప్రజలకు హోటళ్లలో ఆరోగ్యకర, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని జిల్లా అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

హోటళ్లలో నాణ్యమైన ఆహారం అందించాలి
హోటల్‌ లోని వంటశాలను తనిఖీ చేస్తున్న ఆహార భద్రతా అధికారులు

అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ లక్ష్మీనారాయణ

శ్రీకాకుళం, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రజలకు హోటళ్లలో ఆరోగ్యకర, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని జిల్లా అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. నగరంలోని డే, నైట్‌ ప్రాంతంలో శనివారం ఆహార భద్రతా అధి కారులు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. పలు హోటళ్లలోని వంటశాలలు అపరిశుభ్రంగా ఉండ డం, నిల్వ నీటి వల్ల ఈగలు, దోమలు చేరడాన్ని వారు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆహారాన్ని తయారు చేస్తున్న యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. నిర్దేశిత వ్యవధిలోగా లోపాలను సరిదిద్దుకోవాలని ఆదేశించారు. నాణ్య తాలోపంతో ఉన్న ఆహార నమూనాలను సేకరిం చి, విశ్లేషణ నిమిత్తం ఆహార పరిశోధనాశాలకు పంపిస్తున్నా మన్నారు. ల్యాబ్‌ నివేదిక ఆధారంగా బాధ్యులైన హోటల్‌ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వంట సిబ్బంది హెయిర్‌ నెట్లు, గ్లౌజులు ధరించాలని, వండిన ఆహారాన్ని, ముడి సరుకులను వేర్వేరుగా ఉంచా లన్నారు. ఈ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా నిరం తరం కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2026 | 12:10 AM