హోటల్ కార్మికుడి ఆత్మహత్య
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:37 AM
ఒడిశా రాష్ట్రానికి చెందిన కొక్కిరి శ్రీనివాసరావు(33) అనే వ్యక్తి ఉరి పోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కాశీబుగ్గ సిఐ వై.రామకృష్ణ తెలిపారు.
పలాస, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్రానికి చెందిన కొక్కిరి శ్రీనివాసరావు(33) అనే వ్యక్తి ఉరి పోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కాశీబుగ్గ సిఐ వై.రామకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కూడలి వద్ద నివాసం ఉంటున్న శ్రీనివాసరావు సోమవారం ఇంటిలో తన లుంగీతో ఉరి పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు ఆయన భార్య పార్వతి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ వివాహం చేసుకున్నఈ దంపతకుల ఇద్దరు కుమారులు ఉన్నారు. స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో పనులు చేసుకుంటూ శ్రీనివాసరావు జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి అలవాటు పడి వేధిస్తుండడంతో భర్తను విడిచిపెట్టి భార్య ఒడిశా వెళ్లిపోయింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన శ్రీనివాసరావు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.