అధిక లాభం ఆశచూపి..
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:50 AM
జిల్లా లో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి విద్యావంతులు, యువత మోసపోతున్నారు. ఇన్‌స్టా, టెలిగ్రామ్‌ల్లో సైబర్ మోసగాళ్లు పంపిన మెసేజ్‌లను ఓపెన్ చేసి.. అధిక లాభాలకు ఆశపడి తమ ఖాతాల్లో సొ మ్మును ఖాళీ చేసుకుంటున్నారు.
రూ.75,600 కాజేసిన సైబర్ కేటుగాళ్లు
ఉచ్చులో పడి మోసపోయిన యువకుడు
శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): జిల్లా లో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి విద్యావంతులు, యువత మోసపోతున్నారు. ఇన్‌స్టా, టెలిగ్రామ్‌ల్లో సైబర్ మోసగాళ్లు పంపిన మెసేజ్‌లను ఓపెన్ చేసి.. అధిక లాభాలకు ఆశపడి తమ ఖాతాల్లో సొ మ్మును ఖాళీ చేసుకుంటున్నారు. నగరానికి చెంది న ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ, వారు అధిక లాభాలను ఆశ చూపిసూ పంపించిన మెసేజ్‌ను ఓపెన్ చేయడం ద్వారా రూ.75,600 పోగొట్టుకున్న ఘటన చోటుచేసుకుంది. రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివ రాల మేరకు.. నగరంలోని బలగ మెట్టు బూబమ్మనగర్ కాలనీకి చెందిన సురవ రపు గణేష్ డిగ్రీ పూర్తి చేసి కాంపిటేటివ్ పరీక్షల కు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో గణే్‌ష్ ఈ నెల 10న మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తున్న సమయంలో సైబర్ నేరగాళ్లు పంపిన ట్రేడ్ మునాఫ్ అనే ప్రకటనను చూసి ఆకర్షితుడై దానిని క్లిక్ చేశాడు. రూ.10 వేలు పెట్టుబడి పెడి తే రూ.80 వేలు లాభం పొందవచ్చని సైబర్ నేర గాళ్లు తెలపడంతో గణేష్ రూ.10 వేలు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. అయితే సైబర్ నేరగాళ్లు సొమ్ము చెల్లించాలంటూ ఇన్‌స్టా అకౌంట్ నుంచి టెలిగ్రాం అకౌంట్‌లోకి వస్తే దానిలో స్కానర్ పెడతామని తెలిపారు. వారు పంపిన స్కానర్‌కు గణేష్ రూ.10 వేలు జమ చేశాడు. ఈ క్రమంలో గణేష్ అకౌంట్ లో తొలుత రూ.90 వేలు సైబర్ నేరగాళ్లు చూపిం చారు. అయితే దానిని విత్‌డ్రా చేయాలంటే 30 శాతం కమిషన్ కింద రూ.27 వేలు చెల్లిస్తే చెల్లిం చాలని చెప్పారు. దీంతో గణేష్ మరో రూ.27 వేలు చెల్లించాడు. తర్వాత సర్వీస్ టాక్స్ కింద మరో రూ.38,600 చెల్లించాడు. అనంతరం బ్యాంకు సర్వ ర్ డౌన్‌గా ఉందని, అప్‌డేట్ చేయాలని రూ.48 వేలు జమ చేస్తే మొత్తం సొమ్మును డ్రా చేసుకో వచ్చని సైబర్ నేరగాళ్లు చెప్పడంతో గణేష్‌కు అనుమానం వచ్చి.. ఈనెల 11న 1930 టోల్‌ఫ్రీ ద్వారా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను తెలిపిన వివరాలు తీసుకున్న సైబర్ పోలీసులు ఏ అకౌంట్‌లో జమ చేశాడో తెలుసు కొని ఆ అకౌంట్‌లో రూ.60 వేలు ఫ్రీజ్ చేశారు. సైబర్ పోలీసులు నుంచి విషయం తెలుసుకున్న టూటౌన్ సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.