అడుగంటిన కుంటపైనే ఆశలు
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:20 AM
వర్షాభావంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఆకాశంవైపు చూ సిన కళ్లతో ఇప్పుడు కన్నీరు కారుస్తున్నారు.
శ్రీకాకుళం, జూలై 19(ఆంధ్రజ్యోతి): వర్షాభావంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఆకాశంవైపు చూ సిన కళ్లతో ఇప్పుడు కన్నీరు కారుస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరం భంలో వర్షాలు సకాంలో పడతా యన్న ఆశతో నారుమడులు పోసిన రైతులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. వర్షం రాక మడులు ఎండిపోతున్నాయి. ఊరికి ఎక్కడో దూరంగా అడుగంటిపోయిన చిన్న కుంటలో మిగిలిన నీటిని పైపులైన్లు వేసి మడులకు తరించుకుంటున్నారు. పొన్నాడ గ్రామంలో ఎటు చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి.